Harish Rao Priyadarshe Photos: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును టాలీవుడ్ నటుడు ప్రియదర్శి కలిశారు. ది ప్యారడైజ్ సినిమాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రను పోలిన ఎమ్మెల్యే శంకరన్న పాత్రను నటుడు ప్రియదర్శి పోషించారు. అయితే ఆ పాత్రకు మంచి స్పందన లభించింది. ఇప్పుటికే పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రియదర్శికి అభినందనలు తెలుపుగా.. ఇప్పుడు మాజీ మంత్రి హరీశ్ రావు తన ఇంటికి పిలిచి ప్రియదర్శిని ప్రశంసించారు.
Kavitha fires on ktr: నిన్నటి బీఆర్ఎస్ మీటింగులో ఒక రైతు ఫోన్ మాట్లాడుతుంటే నీ పెండ్లామా!? అంత అర్జెంటా!?.. అంటూ అహంకారంతో అతని భార్యనే అవమానించారని కవిత సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
KT Rama Rao Serious Allegations On Revanth Reddy: భూములు అమ్మడం.. కమీషన్లు పొందడం ఇదే రేవంత్ రెడ్డికి తెలిసిన పని అంటూ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెసోళ్ల ఆటలు ఇంకో ఏడాది మాత్రమేనని.. ఒక్క సంవత్సరం ఆగితే కేసీఆర్ రావడం ఖాయమని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.
kavitha responds on the paradise movie song: నేచురల్ స్టార్ నాని హీరోగా ఇటీవల రిలీజైన ది ప్యారడైజ్ మూవీ ఇప్పటికే బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా వినాయక నిమజ్జనం వేళ ఈ మూవీలోని పాటలే ఎక్కడ చూసిన విన్పిస్తున్నాయి.ఈ క్రమంలో తాజాగా.. ఈ మూవీపై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
KCR Will Become Again Chief Minister: తెలంగాణ రైతులకు రేవంత్‌రెడ్డి ఇప్పటికి మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టాడని.. రేవంత్‌రెడ్డి నిజాయితీ గల మోసగాడు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని సర్వేలు తేల్చిచెబుతున్నాయని చెప్పారు.
The paradise Congress vs BRS: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్ చిత్రం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పోలిన పాత్రను ఎంతో పాజిటివ్‌గా చూపించారనే అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా తీవ్ర వాదోపవాదాలు చెలరేగుతున్నాయి.
MLA Padi Kaushik Reddy Hot Comments On Rahul Gandhi: తమ రెండున్నరేళ్ల పోరాటం తర్వాత దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడిందని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అద్భుతం అని చెప్పారు. రాహుల్ గాంధీకి కూడా ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదేనని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రకటించారు.
KCR NTR The Paradise Movie: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా పక్కా యాక్షన్ అవతారంలో నటించిన ది ప్యారడైజ్ చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా ప్రదర్శన ద్వారా ప్రేక్షకులు, నాని అభిమానులకు పలు ఊహించని సర్ ప్రైజ్‌లు లభించాయి. అయితే ఈ సినిమాలో విశేషమేమిటంటే.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కీలక మలుపు తిప్పిన ఇద్దరు ప్రముఖ మాజీ ముఖ్యమంత్రుల స్ఫూర్తితో రూపొందించిన విశిష్ట పాత్రల ప్రస్తావన ఈ చిత్రంలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పోలిన పాత్రలతో అలరించారు. అందులో ఒక పాత్రను ఎమ్మెల్యేగా, మరొక పాత్రను రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెండితెరపై చూపించారు. ఈ రెండు కీలకమైన పాత్రలలో ప్రముఖ నటులు ప్రియదర్శి, పి. విజయ్ కుమార్ నటించి ప్రేక్షకులను విశేషంగా అలరించారు.
KCR NTR The Paradise Movie: నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ది ప్యారడైజ్ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఈ సినిమాలో కొన్ని అతిథి పాత్రలో అభిమానులను ఎంతో మెప్పించాయి. తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులైన ఎన్టీఆర్, కేసీఆర్‌లను పోలిన పాత్రలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇంతకీ ఆ పాత్రల అవసరం ఏంటి? ఆ పాత్రల్లో నటించిన నటులెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
KCR Assets: తెలంగాణ రాజకీయాల్లో భూ వివాదం దుమారం రేపుతోంది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి భూ గణాంకాలు వెల్లడించిన తర్వాత రాజకీయంగా హీటెక్కింది. కేసీఆర్ కుటుంబానికి ఉన్న భూ వివరాలపై ఆసక్తికర చర్చసాగుతోంది. రాజకీయ ప్రముఖుల్లో ఎవరెవరు ఎంతమేర భూములు సంపాదించారనే అంశంపై సవాళ్లు విసురుతున్నారు? రాజకీయాల్లోకి రాకముందు ఉన్న భూములెంత? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్ని భూములున్నాయనే విషయం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు భూములు ఎలా సంపాదించారు? రాజకీయాలు ఆర్థిక వనరులు సమకూరుస్తాయా? రాజకీయ నాయకుల భూ వివాదాలపై జీ తెలుగున్యూస్ స్పెషల్…!!
Jagadish Reddy Slams To Revanth Reddy: కళ్లముందే ఆంధ్రకు నీళ్లు దోచుకుపోతుంటే కబోదుల్లా రేవంత్ రెడ్డి, మంత్రులు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ అనే భూతం తెలంగాణ రాష్టాన్ని నాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి పాదయాత్రలు చేసైనా సరే బీఆర్‌ఎస్ పార్టీ రైతుల పంటలు ఎండకుండా పోరాడుతుందని ప్రకటించారు.