• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /గురుకులాల్లో సీట్లు తేవడమే మేము చేసిన పాపమా?.. ఇద్దరే టీచర్లతో 56 మందికి పాఠాలు చెప్పేదెలా?

గురుకులాల్లో సీట్లు తేవడమే మేము చేసిన పాపమా?.. ఇద్దరే టీచర్లతో 56 మందికి పాఠాలు చెప్పేదెలా?

GO 25 Teacher Adjustment: గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక విద్యావ్యవస్థను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వ నిబంధనలే.. ఆదర్శవంతంగా పనిచేస్తున్న ప్రభుత్వ బడుల ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 25 టీచర్ల సర్దుబాటు చర్యలు మారమూల గ్రామీణ ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల మండల పరిష్కత్ ప్రాథమిక పాఠశాలను ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. గ్రామీణ పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కనీసం ఒక ఉపాధ్యాయుడిని తిరిగి కజ్జర్ల పాఠశాలలోనే కొనసాగించేలా విద్యాశాఖ అధికారులను ఆదేశించాలని ఎంపీ గోడం నగేశ్ ను వేడుకున్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, విద్యార్థులు తల్లిదండ్రులు.

Reported ByBhoomiEdited ByBhoomi
Published: Sep 27, 2026, 11:02 AM IST|Updated: Sep 27, 2026, 11:04 AM IST
joinshare
గురుకులాల్లో సీట్లు తేవడమే మేము చేసిన పాపమా?.. ఇద్దరే టీచర్లతో 56 మందికి పాఠాలు చెప్పేదెలా?
Image Credit: GO 25 Teacher Adjustment

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

GO 25 Teacher Adjustment: ప్రాథమిక విద్యావ్యవస్థను బలోపేతం చేయాల్సిన చోట  నిబంధనలు మారుమూల ప్రాంతాల్లో ఉన్న సర్కార్ బడులకు శాపంగా మారుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 25 టీచర్ల సర్దుబాటు చర్యలు మారమూల గ్రామీణ ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల మండల పరిష్కత్ ప్రాథమిక పాఠశాలను ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది.  గత 10ఏళ్లుగా ప్రతి ఏటా గురుకుల ప్రవేశ పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి.. వందలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యకు బాటలు వేసిన ఈ బడిలో ప్రస్తుతం విద్యాబోధన అస్తవ్యస్తంగా మారింది.  

సెప్టెంబర్ 26వ తేదీ శనివారం ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్‌ కజ్జర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు.  జీవో నెం.25 ప్రకారం పాఠశాలలోని ఐదుగురు ఉపాధ్యాయుల్లో ముగ్గురిని ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేయడంతో తీవ్ర ఉపాధ్యాయ కొరత ఏర్పడిందని వివరిస్తూ.. ప్రధానోపాధ్యాయురాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎంపీకి వినతపత్రం అందజేశారు. పాఠశాలలో 56 మంది విద్యార్థులకు ఇద్దరే టీచర్లు మిగలడం వల్ల 18 సబ్జెక్టుల బోధన, మూల్యాంకనం కష్టసాధ్యంగా మారిందని ఎంపీకి వివరించారు. గ్రామీణ పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కనీసం ఒక ఉపాధ్యాయుడిని తిరిగి కజ్జర్ల పాఠశాలలోనే కొనసాగించేలా విద్యాశాఖ అధికారులను ఆదేశించాలని ఎంపీని వేడుకున్నారు

విజయమే శాపమైందా? 
 

*గత 10ఏళ్ల కాలంలో ఈ ప్రాథమిక పాఠశాల నుంచి 100 మందికి పైగా విద్యార్థులు వివిధ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు సాధించారు. ఇక్కడ చదివిన విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్, టీచర్ ట్రైనింగ్, పీజీ, డిగ్రీ స్థాయిల్లో ఉన్నత స్థానాల్లో నిలిచారు.

*2023-24 విద్యా సంవత్సరం: 11 మంది విద్యార్థులకు గురుకులాల్లో సీట్లు లభించాయి.

*2024-25 విద్యా సంవత్సరం: 10 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.

*2025-26 విద్యా సంవత్సరం: ప్రభుత్వం అందించిన ప్రత్యేక పుస్తకాల ద్వారా శిక్షణ ఇచ్చి మరో 9 మందికి ఉపాధ్యాయులు ప్రవేశాలు సాధించిపెట్టారు.

అయితే.. 4వ తరగతి పూర్తయ్యాక గురుకులాల్లో సీట్లు సాధించిన విద్యార్థులు 5వ తరగతి చదివేందుకు గురుకుల పాఠశాలలకు వెళ్లడం వల్ల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 56కు తగ్గింది. ప్రత్యేక శిక్షణ ఇచ్చి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడమే తమ ఉనికికి ముప్పుగా మారిందని, గురుకులాలకు పిల్లలు వెళ్లడం వల్ల తగ్గిన సంఖ్యను కారణం చూపి ఐదుగురు ఉపాధ్యాయుల్లో ముగ్గురిని ఇతర బడులకు సర్దుబాటు చేయడం ఏంటని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

తల్లిదండ్రుల ఆవేదన: 
మా పిల్లలకు 4వ తరగతిలోనే ఉపాధ్యాయులు కష్టపడి ప్రత్యేక శిక్షణ ఇచ్చి గురుకుల సీట్లు తెప్పిస్తున్నారు. నాలుగో తరగతిలోనే గురుకుల ప్రవేశ పరీక్ష రాసి పిల్లలు వెళ్లిపోవడం వల్ల పాఠశాలలో నమోదు సంఖ్య తగ్గుతోంది. అదే ప్రవేశ పరీక్షను 5వ తరగతి పూర్తి అయ్యాక పెడితే మా బడిలో కనీసం 10 మంది విద్యార్థులు తగ్గకుండా ఉండేవారు కదా. అప్పుడు ఒక ఉపాధ్యాయుడైనా మిగిలేవారు కదా. అని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇద్దరు టీచర్లు.. 18 సబ్జెక్టులు:
ప్రస్తుతం జులై 2026 నాటికి పాఠశాలలో 56 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో నాలుగో తరగతి చదువుతున్న 15 మందిలో దాదాపు 10 మందికి పైగా గురుకుల పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో మిగిలిన ఇద్దరు ఉపాధ్యాయులపై పడుతున్న భారం వర్ణనాతీతం.

*1 నుంచి 5వ తరగతి వరకు బోధన నిర్వహించడం,

*రోజూ 18 సబ్జెక్టులు పూర్తి చేయడం,

*15 రకాల వర్క్‌బుక్స్ పూర్తి చేయించడం,

*ఫెయిర్ నోట్స్ రాయించడం, మూల్యాంకన కార్యక్రమాలు చేపట్టడం,

దీనితో పాటు గురుకుల ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ఇద్దరితో సాధ్యమేనా? అని ఎస్జీటీ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. గురుకుల పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా టీచర్లు, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, పీఈటీ, క్రాఫ్ట్ టీచర్లు ఉంటారు. కానీ, ఇక్కడ పిల్లలు కొద్దిగా తగ్గారనే నెపంతో కేవలం ఇద్దరు ఉపాధ్యాయులతో 5 తరగతుల బోధన ఎలా సాధ్యమవుతుంది?  అని వారు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వానికి విన్నపం:
కష్టపడి నాణ్యమైన విద్యను అందిస్తూ, ఆదర్శంగా నిలుస్తున్న పాఠశాలలు ఇటువంటి నిబంధనల వల్ల నష్టపోకూడదని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేవలం విద్యార్థుల సంఖ్య ప్రాతిపదికన కాకుండా, తరగతికి ఒక ఉపాధ్యాయుడు లేదా సబ్జెక్టు నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను కేటాయించాలి.  ప్రతీ ప్రాథమిక పాఠశాలకు పీఎస్ హెచ్‌ఎమ్  పోస్టును మంజూరు చేసి పరిపాలన, బోధనా నాణ్యతను పెంచే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలంటే విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి, తగ్గిపోయిన ఉపాధ్యాయ పోస్టులను పునరుద్ధరించాలని గ్రామీణులు, ఉపాధ్యాయులు  విజ్ఞప్తి చేస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telangana News