SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

సర్కారీ స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ఉదయం 9:30 లోపే టిఫిన్ పూర్తి చేయాలి!

Government Schools: సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా ఉదయం 6.30గంటల నుంచి 8.45 గంటల మధ్య కాలంలోనే స్కూళ్లకు టిఫిన్ సరఫరా చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమయపాలన కచ్చితంగా అమలు అయ్యే విధంగా చూడాలని సంబంధిత సిబ్బందికి విద్యాశాఖ సూచనలు చేసింది.

Written By Bhoomi
Published: Sep 23, 2026, 02:18 PM IST | Updated: Sep 23, 2026, 02:20 PM IST
Image Credit: Government Schools
Join

Government Schools: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి విద్యాశాఖ కొత్త నిబంధనలు జారీ చేసింది. పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్, పాలు పంపిణీ చేసిన తర్వాత విద్యార్థులు అందరూ కూడా విధిగా ఉదయం 9.30గంటలలోపు తమ టిఫిన్, పాలు తాగే ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా ఉదయం 6.30గంటల నుంచి 8.45 గంటల మధ్య కాలంలోనే స్కూళ్లకు టిఫిన్ సరఫరా చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమయపాలన కచ్చితంగా అమలు అయ్యే విధంగా చూడాలని సంబంధిత సిబ్బందికి విద్యాశాఖ సూచనలు చేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బ్రేక్ ఫాస్ట్ విత్ మిల్క్ స్కీమ్ ను ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లకు విస్తరించి .. విజయవంతంగా అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మరుసటి రోజు స్కూళ్లకు ఎంతమంది విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అవసరమో.. ఆ వివరాలను ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజూ మధ్యాహ్నం 12.00 గంటలలోపు ప్రత్యేక యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా ఇండెంట్ రూపంలో ఎంట్రీ చేయాలి. ఒక వేళ సమయం దాటినట్లయితే ఆటోమేటిగ్గా ఇండెంట్ లాక్ అయిపోతుందని విద్యాశాఖ తెలిపింది. 

Also Read: ఇతరులను చూసి ఈర్ష్య పడితే జీవితంలో చిక్కులు తప్పవు అంటున్న సింహం, నక్క,

 

Also Read: తాపీ మేస్త్రీకి 'డాక్టరేట్.. కష్టాలను జయించి ఉస్మానియాలో Phd సాధించిన వలిగొంగ నరసింహ..

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

 

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Add Zee News as a Preferred Source

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES