రూ.10 కోట్ల చిట్టీల మోసం.. ఉపాధ్యాయుడి నిర్వాకంతో బాధితుల ఆందోళన!
Government Teacher: చిట్టీల పేరుతో ప్రజల నుంచి రూ. 10కోట్ల వరకు వసూలు చేసిన ఓ ప్రభుత్వ టీచర్ కుటుంబం ఇప్పుడు పరారైంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాల్లో కలకలం రేపింది. బాధితులు శనివారం జిల్లా ఎస్పీ నరసింహా ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ భారీ మోసం వెలుగుచూసింది.
Chit Fund Scam: చిట్టీల పేరుతో ప్రజల నుంచి రూ. 10కోట్ల వరకు వసూలు చేసిన ఓ ప్రభుత్వ టీచర్ కుటుంబం ఇప్పుడు పరారైంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాల్లో కలకలం రేపింది. బాధితులు శనివారం జిల్లా ఎస్పీ నరసింహా ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ భారీ మోసం వెలుగుచూసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. చివ్వెంల మండలం ఏనేగండి తండాకు చెందిన ఓ వ్యక్తి.. ఆత్మకూర్ (ఎస్) మండలం శెట్టిగూడెం స్కూల్లో ఎస్టీటీగా విధులు నిర్వహిస్తున్నారు. సూర్యపేటలోని విద్యానగర్ లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. 6ఏళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. తన సొంత తండాతోపాటు చుట్టుపక్కల 12 గ్రామల ప్రజలు, బంధువులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నమ్మకంగా ఉంటూ చిట్టీ డబ్బులు కట్టించుకున్నాడు.
ఆ వ్యక్తి ఒక్కొక్కరి నుంచి రూ. లక్ష నుంచి రూ. 1.30కోట్ల వరకు వసూలు చేశాడు. కొందరికి ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చాడు. మరికొందరికి నెలలవారీగా అధికలాభాలు ఇస్తానంటూ నమ్మబలికాడు. ఇలా రూ. 10కోట్లకు పైగా డబ్బు సమీకరించాడు. అయితే ఏడాదిగా డబ్బులు తిరిగి చెల్లించాలని బాధితులు అతని ఒత్తిడి తీసుకువస్తుండటంతో వాయిదాలు వేస్తూ వస్తున్నాడు.
ఈ క్రమంలోనే పరారయ్యేందుకు పక్కా ప్లాన్ రచించాడు. తనకున్న నాలుగు ఎకరాల భూమిలో ఎక్కువ భాగాన్ని ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించి.. తన పేరిట కేవలం 13గుంటల భూమి మాత్రమే ఉంచుకున్నాడు. సుమారు 10 రోజుల క్రితం హైదరాబాద్ లోని ఓ ముఖ్యమైన వ్యక్తిని కలవాలని చెప్పి ఇద్దరు గ్రామస్థులను తనతో తీసుకెళ్లాడు. అక్కడ ఓ హోటల్లో కూర్చుని తాను అప్పుల్లో కూరుకుపోయానని చెప్పి.. ఇప్పుడే వస్తానని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
గంటలు గడుస్తున్నా.. ఆ వ్యక్తి తిరిగిరాకపోవంతో మోసపోయామని గ్రహించిన బాధితులు, సూర్యపేట, తండాలోని అతని ఇంటికి వెళ్లి చూస్తే ఇంటికి తాళాలు వేసి ఉన్నాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఆ డబ్బును ఏం చేశాడన్న కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.