SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Harish Rao: పండగ వేళ ఆర్టీసీ చార్జీలు పెంచడం సిగ్గుచేటు.. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన హరీష్ రావు..

Harish Rao fires on cm Revanth reddy: బతుకమ్మ, దసరా పండుగ వేళ ప్రజలకు కానుకలు ఇవ్వాల్సింది పోయి.. టికెట్ ధరలను పెంచడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు.

Written By Inamdar Paresh
Published: Oct 18, 2026, 11:01 AM IST | Updated: Oct 18, 2026, 11:09 AM IST
Image Credit: Harishrao(file)
Join

Harish rao slams on cm revanth reddy govt amid bus fares hikes: తెలంగాణ వ్యాప్తంగా దసరా, బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. మహిళలు బతుకమ్మ పండగను ఎంతో  వేడుకగా జరుపుకుంటున్నారు. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి బతుకమ్మను ప్రతీకగా భావిస్తారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, ఆడపడుచులంతా ఒక్కచోట చేరి పాటలు పాడుతూ ఆనందంగా  బతుకమ్మ సంబురం చేసుకుంటారు. ఈరోజు సద్దుల బతుకమ్మను జరుపుకుంటున్నాం. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణలో దసరా, బతుకమ్మ సంబరాల వేళ ఆర్టీసీ ధరల్ని పెంచడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈక్రమంలో ఎక్స్ వేదికగా సంచలన ట్విట్ చేశారు. సీఎం రేవంత్ ప్రభుత్వం..

రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గమంటూ ఏకీపారేశారు. జేబీఎస్ నుంచి కరీంనగర్‌కు రూ. 230 ఉండే టికెట్‌ను ఏకంగా రూ.400కు పెంచారని చెప్పారు. అదే విధంగా.. మహబూబ్‌నగర్‌ నుంచి ఎంజీబీఎస్‌కు మొన్నటివరకు రూ.220 ఉండగా.. ఇప్పుడు రూ.290 పైగా వసూలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రూట్లలో టికెట్ ఛార్జీలు డబుల్ చేసి, జేబులు గుల్ల చేసి, ప్రజలకు పండుగ సంబురం లేకుండా చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంను ఏకీపారేశారు. ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచకుండా, రెగ్యులర్ గా నడిచే బస్సులకే పండుగ స్పెషల్ బోర్డులు తగిలించి చేస్తున్న ఈ దోపిడీ ముమ్మాటికీ ప్రజాపీడనే అవుతుందని హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.  మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి.. పురుషుల నుంచి డబుల్ ఛార్జీలు వసూలు చేస్తారా?.. అంటూ సీఎం రేవంత్ కు ప్రశ్నలు సంధించారు.

భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్ వసూలు చేస్తే.. మహిళలకు రాయితీ ఇచ్చినట్టా? లేక ఆ భారాన్ని తిరిగి అదే కుటుంబంపై మోపినట్టా?.. అంటూ చురకలు  పెట్టారు. ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ.. ఇదేనా మీ ప్రజాపాలన?.. అంటూ కాంగ్రెస్ పాలనను తూర్పారబట్టారు.

ఇప్పటికే మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ఆర్టీసీ టికెట్ ఛార్జీలను 5 సార్లు పెంచారని, ఇప్పుడు పండుగల పేరుతో డబుల్ ఛార్జీలు వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారంటూ మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వ తీరుతో పండుగలకు సొంతూళ్లకు వెళ్లాలంటేనే పేద, మధ్యతరగతి ప్రజలు భయపడే దుస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి, పండుగల పేరుతో పెంచిన అడ్డగోలు ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ బస్సులను యథావిధిగా నడిపి, పేద, మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడకుండా చూడాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంకు డిమాండ్ చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES