తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. సంగారెడ్డిలో అత్యల్పంగా 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు..
Heavy Cold Waves in Telangana: నవంబర్ నెల ప్రారంభం నుంచే తెలంగాణలో మెల్లగా చలిమొదలైంది. దీపావళి తర్వాత ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అంతేకాదు పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతానికి సింగిల్ డిజిట్ చేరకపోయినా.. ఇంచు మించు 10 నుంచి 11 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
Cold Wave Alert: తెలంగాణలో చలితీవ్రత పెరిగిపోయింది. రాష్ట్రంలో అత్యల్పంగా సంగారెడ్డి జిల్లాలో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రంగారెడ్డిలో 11.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. కామారెడ్డి జిల్లాలో 11.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు వికారాబాద్‌లో 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
మరో 25 జిల్లాల్లో 12-15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు..
అదే విధంగా మహబూబ్‌నగర్‌లో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 25 జిల్లాల్లో 12-15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం నుంచి రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.మరోవైపు ఏపీవైపు దూసుకువస్తున్న అక్వాన్ తుఫాన్ కారణంగా తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
శుక్రవారం నుండి మరింత పెరగనున్న చలితీవ్రత..
తుపాన్ తన మార్గాన్ని ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ -ఒడిశా వైపు మార్చుకోవడంతో తెలంగాణలో వర్షాలు కురిసే ఛాన్స్ లేదని పేర్కొంది. ఒకవేళ అవకాశం ఉంటే భద్రాద్రి - కొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లిలో తేలికపాటి - మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.