SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Telangana Rains: తెలంగాణలో దంచి కొడుతున్న వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ..

Heavy rains in Telangana: ముఖ్యంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలుజిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తు ఐఎండీ కీలక సూచనలు చేసింది.

Reported By Inamdar Paresh Written By Inamdar Paresh
Published: Sep 14, 2026, 05:18 PM IST | Updated: Sep 14, 2026, 05:29 PM IST
Image Credit: Tgrainsalert(file)
Join

Yellow alert for these districts in Telangana: ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో గత కొన్నిరోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా ముఖం చాటేసిన వరుణుడు మరల తన ప్రతాపం చూపిస్తున్నాడు. తెలంగాణలో పలు జిల్లాలలో గత కొన్ని గంటలుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో జనజీవనం కాస్త అస్తవ్యస్తంగా మారిపోయింది.

 ఈ క్రమంలో  తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు  వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటలకు 40 నుంచి 50 మైళ్ల వేగంతో గాలులు వీస్తు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అంతే కాకుండా భారీ వర్షాలతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ముఖ్యంగా వాగులు, వంకలు  పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. ఈ క్రమంలో వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బైటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. విద్యుత్ తీగలు ఎక్కడైన తెగిపడితే అధికారులకు సమాచారం ఇవ్వాలని వెల్లడించారు. 

ఇక హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని శాఖలకు చెందిన అధికారులతో సమావేశం అయ్యారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES