తెలంగాణలో ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్..
Heavy Rains in Telangana: తుపాను ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో పలు చోట్ల అడుగంటిన నీటి మట్టాలు ఈ వర్షాల వల్ల కాస్త తేరుకునే అవకాశాలున్నాయి. నిన్నటి నుంచి తెలంగాణలో పలు జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసాయి. ఇక మరో రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Telangana Rain Alert: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం,నల్లగొండ, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.
అల్ప పీడనం ప్రభావంతో వర్షాలు..
కాగా నిన్న అల్పపీడనం ప్రభావంతో నిన్న తెలంగాణలో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. అత్యధికంగా మల్కాజిగిరి జిల్లా కీసరలో 11.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. గంటన్నర పాటు దంచికొట్టిన వర్షంతో ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి జిల్లాల్లోనూ వాన దంచికొట్టింది. ఈ అకాల వర్షాలకు పలు ప్రాంతాల్లో కోతలకు సిద్ధమైన వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు
ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లో నిన్న సాయంత్రం భారీ వర్షం కురిసింది. గంటపాటు దంచికొట్టిన వర్షంతో ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. రోడ్లపై వరదనీరు నిలిచిపోవడంతో పలు ప్రాంతా ల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. షేక్‌పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బహుదూర్‌పురా, చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, నార్సింగ్‌ప్రాంతాల్లో రహదారులపై మోకాళ్లలోతు వరదనీరు నిలిచిపోయింది. ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలితో పాటు మైండ్‌స్పేస్, ఐకియా ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. రాత్రి 8 గంటల వరకు కీసరలో అత్యధికంగా 10.8 సెం.మీ, బహుదూర్‌పురాలో 8.2 సెం.మీ, శేరిలింగంపల్లిలో 7.3 సెం.మీ వర్షపా తం నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు.