• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Crops Loss: రైతులను ముంచిన 'మురసు'.. పంట వర్షార్పణం రైతులు విలవిల

Crops Loss: రైతులను ముంచిన 'మురసు'.. పంట వర్షార్పణం రైతులు విలవిల

Huge Level Crops Loss With Heavy Rains Effect Of Cyclone Murasu: తెలంగాణలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు వర్షాలు లేక పంటలు ఎండిపోతుండగా.. మరోవైపు అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. మురసు తుఫాను ప్రభావంతో ఖమ్మం జిల్లాలో పంటలు నీట మునిగిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Nov 06, 2026, 01:11 PM IST|Updated: Nov 06, 2026, 01:14 PM IST
joinshare
Crops Loss: రైతులను ముంచిన 'మురసు'.. పంట వర్షార్పణం రైతులు విలవిల
Image Credit: Cyclone Murasu Crops Loss

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Harish Rao: కరెంట్‌, నీళ్లు లేక రైతుల కన్నీళ్లు.. ధైర్యం చెప్పిన హరీశ్‌ రావు

Harish Rao: కరెంట్‌, నీళ్లు లేక రైతుల కన్నీళ్లు.. ధైర్యం చెప్పిన హరీశ్‌ రావు

2

Anand Mahindra: రాప్తాడు బాలిక లక్ష్మికి ఆనంద్ మహీంద్రా అండ.. చదువు ఖర్చులన్నీ భరిస్తానని హామీ..

3

Motorola నుంచి పవర్‌ఫుల్ ఫోన్‌.. Snapdragon 8 Gen 5, 12GB ర్యామ్‌తో Moto One లాంచ్!

4

'నా భార్యను చంపలేదు.. మృతదేహాన్ని ముక్కలుగా చేశా..!' కోర్టులో వ్యక్తి సంచలన వాంగ్మూలం

5

Renu Desai: నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది..?.. పవన్ కళ్యాణ్‌తో విడాకులపై రేణుదేశాయ్‌ సెన్సెషనల్ కామెంట్స్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Cyclone Murasu: ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. చేతికొచ్చే సమయంలో ప్రకృతి ప్రకోపానికి బలైంది. మురసు తుఫాన్ అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా అశ్వారావుపేటలో చెరువులకు గండ్లు పడటంతో వందలాది ఎకరాలు నీటమునిగాయి. నాలుగు దశాబ్దాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వెంకమ్మ చెరువుకు భారీ గండి పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరోవైపు దొంటికుంట చెరువు నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యమే తమ కొంపముంచిందని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 3,100 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. అసలు తుఫాన్ సృష్టించిన బీభత్సం ఎంత.. రైతుల కష్టాలు ఎలా ఉన్నాయి.. క్షేత్రస్థాయిలో పరిస్థితిపై  గ్రౌండ్ రిపోర్ట్.

మురసు తుఫాన్.. అశ్వారావుపేట వ్యవసాయ రంగాన్ని అతలాకుతలం చేసింది. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వీచిన ఈదురుగాలులతో పంట పొలాలు చెరువులను తలపించాయి. ఊట్లపల్లి సమీపంలోని వెంకమ్మ చెరువుకు భారీ గండి పడటంతో దిగువ ప్రాంతాల్లోని వందలాది ఎకరాల వరి పంట నీట మునిగింది. నాలుగు దశాబ్దాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చెరువుకు ఈ స్థాయిలో గండి పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చెరువు నీరంతా పొలాల్లోకి చేరడంతో పంటలు నీటిపాలయ్యాయి. చేతికొచ్చే సమయంలో వరి పంట నేలకొరిగి, నీటిలో మునిగిపోవడంతో రైతులకు కన్నీరే మిగిలింది. ప్రకృతి ప్రకోపం ఒకవైపు.. చెరువుల గండ్లు మరోవైపు.. అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీశాయి.

ఇక పంట నష్టం అంచనాలు చూస్తే పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. వ్యవసాయ అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం అశ్వారావుపేట మండలంలోనే సుమారు 2 వేల ఎకరాల వరి, 1,300 ఎకరాల మినుము, 50 ఎకరాల మిర్చి, మరో 200 ఎకరాల్లో ఇతర పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో సుమారు 1,600 ఎకరాల్లో మినుము, 1,500 ఎకరాల్లో వరి పంట నష్టపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మొత్తంగా జిల్లాలో 3,100 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్లు తెలుస్తోంది. పత్తి, మిర్చి చేలల్లోకి వరద నీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల కోసం పెట్టిన పెట్టుబడులన్నీ నీటిపాలయ్యాయి. పంట చేతికొస్తుందన్న ఆశతో ఎదురుచూసిన రైతులకు తుఫాన్ తీవ్ర నిరాశను మిగిల్చింది.

ఇదిలా ఉంటే అశ్వారావుపేటలోని దొంటికుంట చెరువు వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణం పేరుతో చేపట్టిన పనులు, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే దిగువ ప్రాంతాల్లోని వరి, పామాయిల్ పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. చెరువు పరిస్థితిపై ముందుగానే పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని మండిపడుతున్నారు. పనులు చేపట్టే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతులు చేస్తున్న ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది. కేవలం పంట నష్టం అంచనాలు వేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. చెరువులకు గండ్లు పడటానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. నష్టపోయిన ప్రతి రైతును గుర్తించి పారదర్శకంగా పంట నష్టం నమోదు చేయాలి. పెట్టుబడులు కోల్పోయి అప్పుల భారంతో అల్లాడుతున్న అన్నదాతలకు తక్షణమే పరిహారం అందించాలి. ఆరుగాలం శ్రమించిన రైతన్నకు ప్రకృతి కన్నీళ్లు మిగిల్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Rain News
Telugu News
Telangana News