Mancherial: మంచిర్యాలలో ఘోరం.. భార్య ముక్కును కసితిరా కొరికిన భర్త.. అసలేం జరిగిందంటే..?..
Husbaband attacks on wife in mancherial: కోటపల్లికి చెందిన మమతకు మల్లంపేటకు చెందిన మణిచందర్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గత నాలుగేళ్లుగా అదనపు కట్నం కోసం మణిచందర్ తనను వేధిస్తున్నాడని మమత ఆరోపించింది. మంచిర్యాలలో చోటు చేసుకున్న ఈ ఘటన కాస్త వార్తలలో నిలిచింది.
Husband bites off his wife nose in mancherial: ఇటీవల కొంత మంది భార్యభర్తలు ప్రతి చిన్న విషయాలకు గొడవలు పడుతున్నారు. కట్టుకున్న వాళ్లను కాటికి పంపడమే పనిగా పెట్టుకుంటున్నారు. కొంత మంది వివాహేతర సంబంధాలు పెట్టుకుుని గొడవలు పడుతున్నారు.మరికొంత మంది అదనపు కట్నంకోసం భార్యలను వేధిస్తున్నారు. వంట రాలేదని, భార్య అందంగా లేదని టార్చర్ చేస్తున్న వారు కొంత మంది అయితే.. భర్త సంపాదించడంలేదని, బంగారం కొనియ్యడంలేదని మరికొంత మంది దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. తాజాగా.. మంచిర్యాలజిల్లా కోటపల్లిలో ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
మంచిర్యాల జిల్లా కోటపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కోటపల్లికి చెందిన మమతకు మల్లంపేటకు చెందిన మణిచందర్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్ని రోజుల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే.. ఇటీవల తరచుగా భార్యను అదనపు కట్నం కోసం భర్త మణిచందర్ వేధింపులకు గురిచేసేవాడు. ఆమె కొన్ని ఏళ్ల నుంచి ఈ టార్చర్ భరిస్తు వస్తుంది.
ఇది కాస్త పీక్స్ కు చేరడంతో మమతా తన పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో భర్త మరల ఇంటికి రావాలని ఆమెను వేడుకున్నాడు. ఈ క్రమంలో భర్త మారుతాడని భావించిన మరల అత్తింటికి వచ్చింది. దీంతో తన మామపై మణిచందర్ దాడి చేశాడు. దీంతో అడ్డుకొవడానికి ప్రయత్నించిన భార్య మమతపై కోపంతో ఊగిపోయి దాడి చేశాడు.
అంతే కాకుండా కోపంలో ఆమె ముక్కును బలంగా కొరికాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్త స్రావం అయ్యింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆతర్వాత మరల వరంగల్ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఘటనపై మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.