SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ట్యాంక్‌బండ్‌పై కేక్ కటింగ్స్, బర్త్‌డే వేడుకలు చేయొద్దు! అర్ధరాత్రి హంగామాపై సీపీ సజ్జనర్ తీవ్ర హెచ్చరికలు..!

ట్యాంక్‌బండ్‌ అంటే హైదరాబాదీలకు ప్రత్యేక అనుబంధం కలిగింది. కేవలం వీకెండ్‌ మాత్రమే కాదు.. బర్త్‌డే వచ్చిందంటే చాలు.. అర్ధరాత్రి 12 గంటలకు కేక్‌ కట్‌ చేసే ఫ్రెండ్స్‌ బ్యాచ్‌ కూడా కనిపిస్తుంది. కానీ, ఇలాగే కేక్‌ కట్‌ చేయడానికి వచ్చిన ఓ పాప, బంధువు కూడా రోడ్‌ క్రాస్‌ చేస్తున్న సమయంలో మొన్న యాక్సిడెంట్‌ జరిగి చనిపోయారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఇక ఎలాంటి బర్త్‌డే వేడుకలు కూడా చేయకూడదని వార్నింగ్‌ ఇచ్చారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Oct 09, 2026, 03:53 PM IST | Updated: Oct 09, 2026, 04:00 PM IST
Image Credit: Hyderabad CP VC Sajjanar
Join

హైదరాబాద్‌ అంటేనే హుస్సేన్‌ సాగర్‌.. ఇక హుస్సేన్‌ సాగర్‌ అంటేనే భాగ్యనగరం. ఒకప్పుడు ఎంతో మంది తాగునీటి అవసరాలను కూడా తీర్చింది. ఇప్పటి పరస్థితి వేరు. కానీ, రోజూ సాయంత్రం సమయంలో చాలా కుటుంబాలు సేదతీరడానికి వస్తూ ఉంటాయి. ఇక్కడ వీకెండ్‌ వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున సాయంత్రం వేళ కనిపిస్తారు. అక్కడ పిల్లలు, పెద్దలు కూడా ఎంజాయ్‌ చేస్తూ ఉంటారు. అయితే, ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకొంటూ ఉంటారు. చాలామంది కేక్‌ కట్టింగ్‌ చేయడం..  ఇన్ట్సా రీల్స్‌ వంటివి చేయడం చూస్తూ ఉంటాయం.  కానీ, మొన్న పుట్టినరోజునాడే ఒక పాప ఆమె బంధువు వేడుకల కోసం వచ్చి రోడ్డు దాటుతున్న సమయంలో లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ నేపథ్యంలో హైదారబాద్ సీపీ సజ్జనార్‌ కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాల్సిన ఈ పుట్టిన రోజు వేడుకలు క్షణికావేశం వల్ల విషాదంగా మారిందన్నారు.

ఇలా ఆరేళ్ల పాప చనిపోయిన విషయాన్ని గుర్తు చేసి ఆనందంగా జరుపుకోవాల్సిన పుట్టిన రోజు వేడుకలు సురక్షితమైన ప్రదేశాల్లో జరుపుకోవాలి. ఇళ్లలో జరుపుకోవచ్చు. అర్ధరాత్రి సమయంలో రోడ్లపైకి వచ్చి వేడుకలు జరిపితే ప్రమాదం. ఆ సమయంలో వాహనాలు కూడా మితిమీరిన వేగంతో వెళ్తుంటాయి. అయినా, ట్యాంక్‌ బండ్‌ వద్ద పుట్టిన రోజు వేడుకలు జరపడం కూడా నిషేధం. ఎన్నిసార్లు పోలీసులు వచ్చి అక్కడి నుంచి పంపిచినా, మళ్లీ వచ్చి ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో పుట్టినరోజు వేడుకలు  జరుపుకుంటూ ఉంటారు. ఇక ఈ ప్రాంతంలో ఎలాంటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ చేయకూడదని హెచ్చరించారు. క్షణికావేశంతో ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అన్నారు.

Read Also: హుస్సేన్ సాగర్‌లో కూతుర్ని విసిరేసిన తల్లి.. ప్రాణాలకు తెగించి హీరోలా కాపాడిన ఆటోడ్రైవర్.!. అసలు విషయం ఇదే.!.
Read Also: పుట్టిన రోజునాడే నిండిన నూరెళ్లు.. ట్యాంక్ బండ్ వద్ద లారీ ఢీకొని చిన్నారితో పాటు, బంధువు దుర్మరణం..
 

ఇలా ట్యాంక్‌ బండ్‌ వద్దనే కాదు.. చెరువుల ప్రదేశంలో బర్త్‌డే వేడుకలు జరుపకూడదని అన్నారు. పోలీసులకు సహకరించాలని కోరారు. వారి ప్రాణాలు కూడా  కాపాడుకున్నట్లు అవుతుందని ఎక్స్‌ వేధికగా వీడియో కూడా విడుదల చేశారు.. ఇక సాధారణంగా ట్యాంక్‌ బండ్‌ ప్రదేశాల్లో చాలామంది వీకెండ్‌లో వచ్చి సేదతీరుతుంటారు. పిల్లలు, పెద్దలకు కూడా కాస్త సమయంతో దొరుకుతుంది. సెలవు కూడా ఉంటుంది కాబట్టి ఆ ప్రదేశంలో ఎంజాయ్‌ చేస్తూ ఉంటారు. ఇక రానురాను బర్త్‌డే సెలబ్రేషన్స్‌ కూడా చేసుకోవడం ప్రారంభించారు. ఈ ధోరణి రోజూ కూడా కొనసాగుతుంది. కొంతమంది యువత ఇలా ప్రారంభించారు. ఆ ప్రాంతంలో కేక్‌ కట్‌ చేసి వాట్సాప్‌లో అర్ధరాత్రి 12 గంటల సమయంలోనే స్టేటస్‌లు పెట్టడం చూస్తూనే ఉంటాం. ఇలా ఇతరులు కూడా అదే ధోరణి ఫాలో అవుతున్నారు. ఇక సీపీ సజ్జనార్‌ హెచ్చిరించిన తర్వాత కూడా పరిస్థితులు ఎలా ఉంటాయో మరి..

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES