• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కూతుర్ని విసిరేసిన తల్లి.. ప్రాణాలకు తెగించి హీరోలా కాపాడిన ఆటోడ్రైవర్.!. అసలు విషయం ఇదే.!.

Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కూతుర్ని విసిరేసిన తల్లి.. ప్రాణాలకు తెగించి హీరోలా కాపాడిన ఆటోడ్రైవర్.!. అసలు విషయం ఇదే.!.

Mother throws daughter into well in hyderabad: కూతురిని కన్న తల్లి హుస్సేన్ సాగర్ లోకి విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. వెంటనే ఆ మార్గంలో వెళ్తున్న ఆటో డ్రైవర్ దీన్న గమనించాడు. వెంటనే నీళ్లలోకి దూకి బాలికను కాపాడాడు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన వార్తలలో నిలిచింది.

Written ByInamdar Paresh
Published: Oct 09, 2026, 10:23 AM IST|Updated: Oct 09, 2026, 10:36 AM IST
joinshare
Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కూతుర్ని విసిరేసిన తల్లి.. ప్రాణాలకు తెగించి  హీరోలా కాపాడిన ఆటోడ్రైవర్.!. అసలు విషయం ఇదే.!.
Image Credit: motherthrowsdaughterinhussainsagar

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
సూర్యుడి అనుగ్రహంతో 4 రాశులకు బంపర్ లాభాలు.. అక్టోబర్ 11 నుంచి కీలక మార్పులు!

సూర్యుడి అనుగ్రహంతో 4 రాశులకు బంపర్ లాభాలు.. అక్టోబర్ 11 నుంచి కీలక మార్పులు!

2

టీచర్లకు బిగ్ షాక్..FRS హాజరు వేయకపోతే జీతం కట్.. ఒక్కరోజే 68 మందికి నోటీసులు..!!

3

Sarva pitru Amavasya 2026: మహాలయ అమావాస్య.. రేపు ఈ ఒక్కపనిచేస్తే పితృశాపాలు పోయి గొప్ప శుభయోగాలు.!.

4

వీపుపై బిడ్డ, చేతిలో పని.. ఈ వర్కింగ్ మదర్ స్టోరీ చూస్తే కన్నీళ్లు ఆగవు.. వీడియో వైరల్!

5

Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కూతుర్ని విసిరేసిన తల్లి.. ప్రాణాలకు తెగించి హీరోలా కాపాడిన ఆటోడ్రైవర్.!. అసలు విషయం ఇదే.!.

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mother allegedly throws daughter into hussain sagar in hyderabad: అనాదీగా తల్లిని మించిన దైవంలేదని చెప్తారు. నవమాసాలు మోసి కని పెంచిన బిడ్డ కోసం తల్లి ఎలాంటి త్యాగాలు, పోరాటాలు చేయడానికైన వెనుకాడదు. అంతే కాకుండా ఎప్పుడు తన పిల్లల భవిష్యత్ కోసం తాపత్రయ పడుతుంది.  కానీ ఇటీవల కొంత మంది తల్లులు చాలా భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. తమ వివాహేతర సంబంధాలకు అడ్డొస్తున్నారని బిడ్డలను సైతం హతమారుస్తున్నారు.

  ఆర్థిక సమస్యలతో సతమతమై తమ పిల్లలను అమ్మడం, ఎక్కడైన వదిలేయడం లేదా చివరకు చంపడానికి సైతం వెనుకాడటంలేదు. ఇలాంటి విషాదకర ఘటన హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చింది.


హైదరాబాద్ లోని ఓల్డ్ బోయిన్‌పల్లి హస్మత్‌పేట ప్రాంతానికి చెందిన షబానా అనే మహిళ గత కొన్నేళ్లుగా తన భర్తకు దూరంగా ఉంటోంది. చుట్టుపక్కల ఇళ్లలో పనిచేసుకుంటూ తన ఇద్దరు కూతుళ్లను పోషించుకుంటుుంది. 

అయితే.. ఆమె రెండో కుమార్తె రుక్సానా (6) గత కొద్దిరోజులుగా పెద్దపేగు ఇన్‌ఫెక్షన్ సమస్యతో బాధపడుతోంది. ఆమెను ఎన్ని ఆస్పత్రులకు తిప్పిన, చికిత్స అందించిన కూడా లాభంలేకుండా పోయింది.తన బిడ్డపడుతున్న బాధను చూడలేక  చివరకు తల్లి షబానా ఒక కఠిన నిర్ణయం తీసుకుంది.  

చికిత్స మరింత భారం కావడంతో మనస్తాపానికి గురైన షబానా తన కుమార్తె రుక్సానాను హుస్సేన్‌సాగర్‌ వద్దకు తీసుకెళ్లింది. అక్కడ ఎవరు గమనించడంలేదని భావించి ఒక్కసారిగా తన కూతుర్ని హుస్సేన్ సాగర్ నీళ్లలోకి విసిరేసింది.  ఆ సమయంలో  అదృష్టవశాత్తూ అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ ఇది గమనించాడు. 

వెంటన పరుగున వెళ్లి నీళ్లలోకి దూకాడు. బాలికను పట్టుకుని పైకి తీసుకొచ్చాడు. వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించారు. బాలికకు ప్రాణాపాయం తప్పింది.  ఈ ఘటనపై కేసు నమోదు చేసి  విచారణ చేపట్టారు.  ఆ బాలిక తల్లికి పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్లు సమాచారం.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Telangana News
Crime News