SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Hyderabad students holidays: విద్యార్థులకు 3 రోజుల సెలవులు.. కారణం ఇదే!

Hyderabad students holidays: హైదరాబాద్‌లోని విద్యార్థులకు ఊహించని విధంగా మూడు రోజుల సెలవులు ప్రకటించారు. మాదాపూర్ ప్రాంతంలోని కొన్ని కార్పొరేట్ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు ఈ సెలవులు ఇవ్వనున్నారు. అయితే ఈ సెలవుల వెనుక నీటి సమస్య ప్రధాన కారణంగా మారింది.

Written By Vishnu Priya
Published: Nov 04, 2026, 10:02 AM IST | Updated: Nov 04, 2026, 10:06 AM IST
Join

 Hyderabad students holidays: హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ నిర్వాహకులు సమ్మె చేపట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు నీటి కొరత ఏర్పడితే ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన కొన్ని హాస్టళ్ల యాజమాన్యాలు విద్యార్థులకు మూడు రోజుల సెలవులు ప్రకటించినారు.

నీటి సరఫరా నిలిచిపోతే హాస్టళ్లలో విద్యార్థులకు తాగునీరు, స్నానాలు, ఇతర అవసరాలకు నీరు అందించడం కష్టంగా మారుతుంది. అందుకే విద్యార్థులను తాత్కాలికంగా ఇళ్లకు పంపించాలని యాజమాన్యాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే హాస్టళ్ల నిర్వాహకులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు మూడు రోజుల పాటు ఇళ్లలో ఉండే అవకాశం ఏర్పడింది.

అయితే ఈ సెలవులు అన్ని పాఠశాలలకు వర్తిస్తాయా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మాదాపూర్ ప్రాంతంలోని కొన్ని కార్పొరేట్ హాస్టళ్ల యాజమాన్యాలు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మూడు రోజుల తర్వాత నీటి సరఫరా పరిస్థితిని పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని యాజమాన్యాలు తెలిపినట్లు సమాచారం. ఒకవేళ నీటి సమస్య పరిష్కారం కాకపోతే సెలవులను పొడిగించే అవకాశం కూడా ఉండొచ్చని భావిస్తున్నారు.

మొత్తానికి వాటర్ ట్యాంకర్ల సమ్మె కారణంగా విద్యార్థుల చదువుపై కూడా ప్రభావం పడే పరిస్థితి కనిపిస్తోంది. నీటి సరఫరా త్వరగా సాధారణ స్థితికి చేరుకుంటే విద్యార్థులు తిరిగి హాస్టళ్లకు వెళ్లి తమ చదువులను కొనసాగించనున్నారు. ఈ అంశంపై అధికారికంగా మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Read More: ఓపీఎస్, సీపీఎస్ కోరుతూ.. నేడు OUలో 1500 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ భారీ ర్యాలీ..!!

Read More: కండక్టర్ ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం భరోసా: రూ.10 లక్షల ఆర్థిక పరిహారం ప్రకటన!

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  

ZEENEWS TRENDING STORIES