SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తెలుగు తేజం అదుర్స్.. 'స్టార్ మిస్ టీన్ ఇండియా 2026' ఫస్ట్ రన్నరప్‌గా హైదరాబాద్ అమ్మాయి!

Star Miss Teen India 2026: హైదరాబాద్‌కు చెందిన అమ్మాయికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. స్టార్‌ మిస్‌ టీన్‌ పోటీల్లో నగరానికి చెందిన రిషిత పెన్మెత్సకు ఫస్ట్‌ రన్నరప్‌ టైటిల్‌ గెలుచుకుంది. జైపూర్‌లో నిర్వహించిన Z studios లో నిర్వహించిన ఈ జాతీయ స్థాయి పోటీల్లో దేశవ్యాప్తంగా 14-18 ఏళ్ల వయస్సు ఉన్న 31 మంది యువతులు పాల్గొన్నారు. ఇందులో ఒబుల్‌ రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌లో చదువుతున్న రిషిత కూడా ఈ పోటీల్లో పాల్గొంది. ఈమెకు ఇది మొదటి పోటీ కూడా. అయితే, మూడు నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్న రిషిత మొదటిసారి అందాల పోటీల్లో పాల్గొని రికార్డు సృష్టించింది. తండ్రి రామకృష్ణ, తల్లి ప్రత్యూష ప్రోత్సాహంతో ఆమె జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొంది. ఫస్ట్‌ రన్నరప్‌ టైటిల్‌ను కూడా కైవసం చేసుకుంది.

Written By Renuka Godugu
Published: Nov 25, 2026, 11:21 IST | Updated: Nov 25, 2026, 11:24 IST
Image Credit: Star Miss Teen India 2026:
Join

Star Miss Teen India 2026: హైదరాబాద్‌కు చెందిన అమ్మాయికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. స్టార్‌ మిస్‌ టీన్‌ పోటీల్లో నగరానికి చెందిన రిషిత పెన్మెత్సకు ఫస్ట్‌ రన్నరప్‌ టైటిల్‌ గెలుచుకుంది. జైపూర్‌లో నిర్వహించిన Z studios లో నిర్వహించిన ఈ జాతీయ స్థాయి పోటీల్లో దేశవ్యాప్తంగా 14-18 ఏళ్ల వయస్సు ఉన్న 31 మంది యువతులు పాల్గొన్నారు. ఇందులో ఒబుల్‌ రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌లో చదువుతున్న రిషిత కూడా ఈ పోటీల్లో పాల్గొంది. ఈమెకు ఇది మొదటి పోటీ కూడా. అయితే, మూడు నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్న రిషిత మొదటిసారి అందాల పోటీల్లో పాల్గొని రికార్డు సృష్టించింది. తండ్రి రామకృష్ణ, తల్లి ప్రత్యూష ప్రోత్సాహంతో ఆమె జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొంది. ఫస్ట్‌ రన్నరప్‌ టైటిల్‌ను కూడా కైవసం చేసుకుంది.

ఈ సందర్భంగా రిషిత మాట్లాడుతూ జాతీయ స్థాయిలో తెలుగు యువతులు తక్కువగా పాల్గొంటారు. కానీ తొలి ప్రయత్నంలోనే ఇలా రన్నరప్‌గా జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దీనికి వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ కూడా ఎంతో అవసరం. తల్లిదండ్రులు, విద్యాసంస్థలు ప్రోత్సహిస్తే ఇలాంటి విజయాలు సాధించగలరు అన్నారు.

ఇక భవిష్యత్తులో కూడా అంతర్జాతీయ స్థాయిలో కూడా భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించడమే తన లక్ష్యమన్నారు. ఈ అందాల పోటీల్లో మరిన్ని విజయాలు సాధించడానికి ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. హైదరాబాద్‌ అమ్మాయి రిషిత తన మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడంతో పలువురు ఆమెకు అభినందనలు కూడా తెలియజేస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES