December 2026 Horoscope: 2026 సంవత్సరం ముగిసిపోవడానికి ఇంకా మరికొన్ని రోజులే ఉన్నాయి. ఏడాది చివరి నెల డిసెంబర్ జ్యోతిష్య శాస్త్ర పరంగా ఎంతో కీలకమైనదిగా జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఈ నెలలో ప్రధాన గ్రహాల గమనంలో చోటుచేసుకునే మార్పులు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉన్నాయి.. ముఖ్యంగా డిసెంబర్ 5న ఛాయా గ్రహాలైన రాహువు మకరరాశిలోకి.. కేతువు కర్కాటకరాశిలోకి సంచారం చేయబోతున్నాయి.. డిసెంబర్ 11న శని దేవుడు మీనరాశిలో తన తిరోగమనంలో వెళ్లబోతున్నాడు.. ఆ వెంటనే డిసెంబర్ 13న దేవగురువు బృహస్పతి సింహరాశిలో వక్రగతిలోకి వెళ్తాడు.. డిసెంబర్ 16న గ్రహరాజు సూర్యుడు ధనుస్సురాశిలోకి సంచారం చేస్తాడు. దీని కారణంగా ఈ నెల కొన్ని రాశులవారికి బంపర్ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మేష రాశి:
మేష రాశి వారికి డిసెంబర్ నెల కెరీర్ పరంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి సానుకూలమైన మార్పులు వస్తాయి. అదనపు బాధ్యతలు పెరిగినప్పటికీ చక్కగా పనులు చేసి బంపర్ లాభాలు పొందుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా సులభంగా ఫలిస్తాయి.. వ్యాపారవేత్తలు కీలక ఒప్పందాలు కూడా సులభంగా పూర్తి చేస్తారు. అయితే, కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ నెల ఆర్థికంగా చాలా అద్బుతంగా ఉండే ఛాన్స్‌లు ఉన్నాయి. కార్యాలయంలో మీ కష్టానికి తగిన గుర్తింపు కూడా సులభంగా లభిస్తుంది.. ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా సులభంగా లభిస్తాయి. జీతం పెరుగుదలతో పాటు పదోన్నతి పొందే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వ్యాపారులకు కొత్త పరిచయాలు కూడా ఏర్పడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు..
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారి ఆర్థిక పరిస్థితి డిసెంబర్‌లో గణనీయంగా మెరుగుపడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. పని ఒత్తిడి ఉన్నప్పటికీ పై అధికారుల సహకారంతో అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. గతంలో రావాల్సిన మొండి బాకీలతో పాటు నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి సులభంగా అందుతుంది. వ్యాపారంలో లాభాలు పెరగడమే కాకుండా.. కుటుంబ సభ్యుల పూర్తి సపోర్ట్ కూడా పొందుతారు.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెల చాలా అద్భుతంగా ఉంటుంది. ఆఫీసులో మీ పనితీరుకు మంచి పేరు కూడా లభిస్తుంది. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్యలు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వ్యాపార విస్తరణకు వేసే కొత్త ప్రణాళికలు తప్పకుండా ఫలిస్తాయి. పాత పనుల నుంచి కూడా భారీ మొత్తంలో లాభాలు కూడా పొందుతారు..
NOTE: