Delhi woman gang rape case: దేశంలో మహిళల భద్రత ప్రస్తుతం గాల్లో దీపంలా మారిపోయిందని చెప్పుకొవచ్చు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కూడా కామాంధులు మారడటంలేదు. ప్రతిరోజు అమ్మాయిలపై అఘాయిత్యాలు వార్తలలో ఉంటున్నాయి. ఈ క్రమంలో తూర్పు కేఫ్ లో పనిచేస్తున్న యువతిపై అత్యాచారం జరిగింది. రాత్రి పూట ఒక వ్యక్తి వద్ద కేఫ్ తాళాలు ఉండటంతో కేఫ్ లో పార్టీ చేసుకున్నారు.
ఆ తర్వాత మద్యం మత్తులో యువతిపై అత్యాచారంకు పాల్పడ్డారు. మరుసటి రోజు యువతి పోలీసుల్ని ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఘటన ప్రస్తుతం ఢిల్లీలో మహిళల భద్రతపై ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.