SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తెలంగాణలో సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. హైదరాబాద్‌లో అత్యంత చలి నమోదైన ప్రాంతాలివే! ఈ వారం మరింత జాగ్రత్త!

తెలంగాణలో చలి జనాన్ని వణికిస్తోంది. ఉత్తర దిశ నుంచి వీస్తున్న చల్లటి గాలుల ప్రభావంతో పశ్చిమ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. కొమరం భీమ్‌, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో ఈ సీజన్లోనే అత్యల్పంగా 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో కూడా చలి తీవ్రత అధికంగా ఉంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చలి విపరీతంగా ఉంది. దీంతో సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Written By Renuka Godugu
Published: Nov 20, 2026, 09:51 IST | Updated: Nov 20, 2026, 09:52 IST
Image Credit: Hyderabad Winter Alert:
Join

Hyderabad Winter Alert: తెలంగాణలో సింగిల్‌ డిజిట్‌కు టెంపరేచర్‌ పడిపోయింది. ఈ సీజన్‌లో ఈరోజు అత్యంత తక్కువగా నమోదైంది. సంగారెడ్డి సత్వార్‌లో 9.6, కోహిర్‌ 9.7, డోంగ్లీ 10, మొయినాబాద్‌ 10.7, నర్సాపూర్‌-12, వర్ని-12 నమోదయ్యాయి.

హైదరాబాద్‌లో ఇలా..
పటాన్‌చేరు 12, బీహెచ్‌ఈఎల్‌ 13, హెచ్‌సీయూ శేరిలింగంపల్లి 13, అమీన్‌పూర్‌ 13, రాజేంద్రనగర్‌ 14, గచ్చిబౌలీ 14 ఇబ్రహీంపట్నం 14, ఆర్‌సీ పురం 15, ఎంఎంటీఎస్‌ లింగంపల్లి 15, మేడ్చల్‌ 16, దూలపల్లి 16, కుత్బుల్లాపూర్‌ 16, మౌలాలీ 16 నమోదవుతున్నాయి.

గడిచిన 24 గంటల్లో కనిష్ట ఉష్ణోగ్రత 3 డిగ్రీలు తగ్గింది. 18 హైదరాబాద్‌లో చలితీవ్రత నమోదైంది. ఆదిలాబాద్‌ 10, వికారాబాద్‌ పుట్టపహాడ్‌లో 11, హన్మకొండ 14, మెదక్‌ 14 నమోదవుతున్నాయని ఐఎండీ తెలిపింది. దీంతో శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు ప్రధానంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

వాతావరణ శాఖ విడుదల చేసిన 7 రోజుల స్థానిక అంచనా ప్రకారం నవంబర్ 25 వరకు హైదరాబాద్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై పొగమంచు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా మరికొన్ని రోజుల పాటు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ వ్యాప్తంగా కొన్ని రోజులుగా చలి తీవ్రత ఎక్కువ కావడంతో, చాలా చోట్ల పొడి వాతావరణం ప్రభావం కూడా ఉండటంతో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. కనిష్ట స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

రాత్రిపూట ప్రారంభమైన చలి ఉదయం వరకు ఉంటుంది. మధ్యాహ్న సమయానికి మాత్రం కాస్త ఎండ తన ప్రభావాన్ని చూపిస్తుంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు మాత్రమే క్రమక్రమంగా తగ్గుతున్నాయి. తెలంగాణ కశ్మీర్‌గా పిలిచే ఆదిలాబాద్ జిల్లాలోనే ఎప్పటిలాగే అత్యల్ప స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది చలికాలం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఆదిలాబాద్ జిల్లాలోనే కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 11 డిగ్రీల మేర అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవగా, సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో కూడా కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

హైదరాబాద్లో సాధారణం కంటే 5 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోంది.  హైదరాబాద్ నగరంలో చలి ప్రభావం మిగతా చోట్ల కంటే కాస్త ఎక్కువగా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా పొగమంచు కురిసే అవకాశం కూడా
ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటివరకు కేవలం చలి మాత్రమే ఉంది. తెల్లవారుజామున ఉండాల్సిన పొగమంచు ఇప్పటివరకు కనిపించలేదు. కానీ, రేపు, ఎల్లుండి నుంచి పొగమంచు ప్రభావం కూడా కనిపించే అవకాశం ఉంది. పొగమంచు ఎక్కువగా ఉంటే
తెల్లవారుజామున వాహనాలు నడపడం చాలా ఇబ్బందిగా
ఉంటుంది.

ప్రయాణికులు జాగ్రత్త..
వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా నడపాలని అధికారులు సలహా ఇస్తున్నారు. తెలంగాణ
వ్యాప్తంగా చలి ప్రభావంతో ప్రజలు వణికిపోతున్నారు. సంగారెడ్డిలో 11, రంగారెడ్డిలో11, కామారెడ్డి 12, వికారాబాద్‌ 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ జిల్లాలతో పోల్చుకుంటే హైదరాబాద్ నగరంలో చలి ప్రభావం కాస్త ఎక్కువగా కనిపిస్తోంది.  హైదరాబాద్ శివారులో ఓపెన్ ప్లేసెస్ ఎక్కువగా ఉండటంతో చల్లటి గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆ ప్రాంత ప్రజలు తెల్లవారుజామున బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. 

తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో చలి ప్రభావం కనిపిస్తున్న లక్షణాలు ప్రారంభమయ్యాయి. రాబోయే రోజుల్లో కూడా చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. సీజన్లను గమనిస్తే, ఈసారి ఎండాకాలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే ధోరణి కొనసాగుతూ,
వానాకాలంలో వర్షాలు బాగా పడతాయని అనుకున్నప్పటికీ లోటు వర్షపాతం నమోదైంది. సరే ఈ వానాకాలం పూర్తిస్థాయిలో ప్రజలను నిరాశ పరిచింది. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం, వేడి ఎక్కువగా ఉంటుంది. వానాకాలంలో పూర్తిస్థాయిలో వర్షాలు పడకపోవడం, ఎల్ నినో ప్రభావంతో తీవ్రమైన కరువు తెలంగాణ వ్యాప్తంగా ఏర్పడింది. ఇదే పరిస్థితుల్లో వాతావరణ శాఖ మొదట అంచనా వేసినట్టుగా ఎల్ నినో ప్రభావం ఉంది. కాబట్టి చలికాలంలో కూడా గతంలో ఉన్నట్టుగా చలి తీవ్రత ఉండకపోవచ్చని అంచనా వేశారు.

కానీ ఆ అంచనాను కాస్త తలకిందులు చేస్తూ చలి తన ప్రభావాన్ని మొదటి నుంచే చూపిస్తోందని చెప్పవచ్చు. మొదట్లో దాదాపు నవంబర్ మొదటి వారం, సెప్టెంబర్, అక్టోబర్ చివరి వారంలో మనకు వింటర్ సీజన్ ప్రారంభమైంది. అప్పుడు మాత్రం అంత ప్రభావం కనిపించలేదు. దాంతో అందరూ సాధారణంగా అనుకున్నది ఏమిటంటే, ఈసారి చలి ఎక్కువగా ఉండకపోవచ్చని. వానాకాలంలో ఎండ తీవ్రత, ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయో చూస్తే, చలి ప్రభావం కూడా ఎక్కువగా ఉండకపోవచ్చని భావించారు. సాధారణంగా వేడి ఉంటుందని అంచనా ఉన్నప్పటికీ చలి తన ప్రభావాన్ని చూపుతోంది. ఉదయం నుంచే చాలా చోట్ల విపరీతమైన చలి ఉంటోంది, ఇంకా ఎక్కువగా ఉంటుంది. సాధారణ ప్రాంతాల కంటే ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES