• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • / జగిత్యాలలో ఏసీబీ దాడులు.. EMI పద్ధతిలో లంచం తీసుకుంటూ చిక్కిన CDPO దారోజు పద్మ..!!

జగిత్యాలలో ఏసీబీ దాడులు.. EMI పద్ధతిలో లంచం తీసుకుంటూ చిక్కిన CDPO దారోజు పద్మ..!!

Jagtial ACB Raid: అవినీతి అధికారులు లంచాలు తీసుకోవడంలో కొత్త దారులు వెతుక్కుంటున్నారు. సాధారణంగా ఒకేసారి పెద్ద మొత్తంలో డిమాండ్ చేసే అధికారులు, ఇక్కడ మాత్రం వినూత్నంగా నెలవారీ వాయిదాల పద్ధతిలో మామూళ్లు వసూలు చేస్తూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ విస్తుపోయే ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో వెలుగుచూసింది.

Reported ByBhoomiEdited ByBhoomi
Published: Sep 26, 2026, 09:05 PM IST|Updated: Sep 26, 2026, 09:07 PM IST
joinshare
 జగిత్యాలలో ఏసీబీ దాడులు.. EMI  పద్ధతిలో లంచం తీసుకుంటూ చిక్కిన CDPO దారోజు పద్మ..!!
Image Credit: Jagtial ACB Raid

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Jagtial ACB Raid: అవినీతి అధికారులు లంచాలు తీసుకోవడంలో కొత్త దారులు వెతుక్కుంటున్నారు. సాధారణంగా ఒకేసారి పెద్ద మొత్తంలో డిమాండ్ చేసే అధికారులు, ఇక్కడ మాత్రం వినూత్నంగా  నెలవారీ వాయిదాల పద్ధతిలో మామూళ్లు వసూలు చేస్తూ ఏసీబీ  అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ విస్తుపోయే ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో వెలుగుచూసింది.

 అంగన్‌వాడీ కేంద్రాలపై తనిఖీల పేరుతో లంచం డిమాండ్ చేసిన అధికారిణి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి సీడీపీఓ దారోజు పద్మను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.21 అంగన్‌వాడీ కేంద్రాల నుంచి నెలకు రూ.వెయ్యి చొప్పున... మూడు నెలలకు రూ.63 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.

తనిఖీల్లో ప్రతికూల వ్యాఖ్యలు చేయకుండా అధికారికంగా అనుకూలంగా వ్యవహరించేందుకు ఈ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.మెట్‌పల్లి కార్యాలయం వెలుపల ఫిర్యాదుదారుడి నుంచి రూ.63 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ కరీంనగర్ యూనిట్ అధికారులు పట్టుకున్నారు.
ఆమె వద్ద నుంచి మొత్తం రూ.63 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీడీపీఓను అరెస్ట్ చేసి కరీంనగర్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.ప్రభుత్వ అధికారులకు ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telangana News