నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలోనే 15 వేల ఉద్యోగాల భర్తీ.. మంత్రి కీలక ప్రకటన..!!
Telangana Government Jobs: తెలంగాణలో త్వరలో 15,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. 'పీఎస్ఆర్ యువనేస్తం' అనే పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్, నిరుద్యోగ యువతకు ఏడాది పాటు ఉచిత ఆన్‌లైన్ శిక్షణను అందించనుంది.
Telangana Government Jobs: తెలంగాణలో త్వరలో 15,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. 'పీఎస్ఆర్ యువనేస్తం' అనే పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్, నిరుద్యోగ యువతకు ఏడాది పాటు ఉచిత ఆన్‌లైన్ శిక్షణను అందించనుంది. ఇప్పటికే లక్ష మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. శిక్షణతో పాటు పుస్తకాలను కూడా ఉచితంగా అందిస్తారు. 2016లో ఖమ్మంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమం ఫలితంగా 462 ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయని మంత్రి గుర్తు చేశారు. దీపావళి నాటికి జర్నలిస్టుల గృహ స్థలాల సమస్యను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి అంగీకరించారని ఆయన తెలిపారు.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకున్న పరిస్థితులను ద్రుష్టిలో ఉంచుకుని తన పుట్టినరోజును నిరాడంబరంగా జరుపుకున్నారు. బుధవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి పొంగులేటికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సచివాలయంలో తన ఛాంబర్ లో ఆర్సీ ఎగ్జామ్స్ సంస్థ సహకారంతో రూపొందించిన పీఎస్ఆర్ యువనేస్తం ఆన్ లైన్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని పొంగులేటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు నాణ్యమైన శిక్షణ అందించి.. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే విధంగా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రి వివరించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఖరీదైన కోచింగ్ తీసుకోలేని అభ్యర్థులకు ఈ స్కీమ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
గత అనుభవాలను ప్రస్తావిస్తూ.. 2016లో ఖమ్మంలో 2,300 మంది నిరుద్యోగులకు ఆన్‌లైన్ శిక్షణ అందించినట్లు మంత్రి తెలిపారు. వారిలో 462 మంది వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఆయన గుర్తుచేసుకున్నారు. అప్పుడు సాధించిన ఫలితాల స్ఫూర్తితో.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభ్యర్థులకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు ప్రస్తుత కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యువతకు, అలాగే ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులకు పోటీ పరీక్షల తయారీకి సమాన అవకాశాలు కల్పించడమే దీని లక్ష్యమని తెలిపారు.
ప్రైవేట్ సంస్థలో పోటీ పరీక్షల శిక్షణకు ఒక్కో అభ్యర్థికి సుమారు రూ. 1,00,000 ఖర్చవుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. అంతేకాకుండా, పుస్తకాలు మరియు ఇతర అధ్యయన సామగ్రి కోసం మరో రూ.14,000 నుండి రూ.30,000 వరకు ఖర్చు అవుతుందని ఆయన అన్నారు. ఈ భారాన్ని భరించలేని నిరుద్యోగులకు సహాయపడటానికి పి.ఎస్.ఆర్. యువనేస్తం ఉచిత ఆన్‌లైన్ శిక్షణ అవసరమైన పుస్తకాలను అందిస్తోందని పొంగులేటి తెలిపారు.
Also Read: