Bada Vinayak Immersion:ఖైరతాబాద్ పెద్ద వినాయకుడు ఊరేగింపు సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బల్ మినార్, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా, లుంబినీ పార్క్ పక్కన ఉన్న ఎన్టీఆర్ మార్గ్ మీదుగా శోభయాత్ర సాగనుంది. బడా గణేష్ నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మధ్యాహ్నం 12 గంటల్లోపే నిమజ్జనం కార్యక్రమం పూర్తి చేయాలనే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు. 69 అడుగుల ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం లాంగ్ బూమ్ మెకానికల్ క్రేన్‌ను ఏర్పాటు చేశారు. వినాయక్ సాగర్‌లో స్వామివారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు.ఖైరతాబాద్ గణేశుని నిమజ్జన నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి.
వినాయక నిమజ్జనం సందర్బంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు..
ఈ మేరకు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమలు కానున్నాయి. ఖైరతాబాద్ ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. అయితే.. విగ్రహాలను తరలించే వాహనాలకు మాత్రమే ప్రధాన ఊరేగింపు మార్గంలో అనుమతి ఉంటుందని. మిగతా వాహనదారులంతా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
మధ్నాహ్నం 12 గంటలకు సాగర తీరానికి ఖైరతాబాద్ వినాయకుడు..
ఖైరతాబాద్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు శోభాయాత్ర...మధ్యాహ్నం 12 గంటలకు సాగర్ తీరానికి బడా గణేష్ చేరుకోనుంది. మహాగణపతి నిమజ్జనానికి క్రేన్ నంబర్-4 సిద్ధంగా ఉంచి అధికారులు. మహ్నం 1:30 గంటలలోపు నిమజ్జనం పూర్తి చేయనున్నారు. శోభాయాత్ర మార్గంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు. 28 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 10 వేల సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచారు. ట్యాంక్ బండ్ చుట్టూ 100 హైరైజ్ కెమెరాలు. 24 డ్రోన్లతో టెక్నికల్ నిఘా ఏర్పాటు చేశారు. వినాయక్ సాగర్ చుట్టూ 40కి పైగా క్రేన్లు. బాలాపూర్ నుంచి సాగర్ వరకు 18 కి.మీ. యాత్ర ప్రారంభం కానుంది. ఈ రోజు ఉదయం నుంచి రేపు సాయంత్రం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.