SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

క్షణికావేశం.. ఇద్దరు పిల్లలను అనాథలను చేసిన విషాదం..

Khammam Family Tragedy Telugu Latest News: క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల బుధవారం చోటు చేసుకుంది. చిన్న చిన్న కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 16, 2026, 06:13 PM IST | Updated: Sep 16, 2026, 06:15 PM IST
Image Credit: క్షణికావేశం.. ఇద్దరు పిల్లలను అనాథలను చేసిన విషాదం..
Join

Khammam Family Tragedy Telugu News: క్షణికావేశంలో తీసుకున్న ఒక చిన్న నిర్ణయం నిండు సంసారాన్ని లేకుండా చేసింది.. క్షణకాలం నిలవని ఆవేశం.. విచక్షణ కోల్పోయిన మనస్తత్వం రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి.. ఇద్దరు చిన్నారులను అనాథలుగా మార్చేసింది.. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అమ్మపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

స్థానికులు, బంధువులు అందించిన సమాచారం ప్రకారం.. అమ్మపాలెం గ్రామానికి చెందిన హరిప్రసాద్, సునీత దంపతుల మధ్య చాలా కాలం నుంచి కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి.. ఈ క్రమంలోనే కుటుంబంలో జరిగిన చిన్న వివాదం పెరిగి పెద్దడవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురైన హరిప్రసాద్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు.. ఆవేశంలో ఖమ్మం సమీపంలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువ వద్దకు చేరుకున్న ఆయన.. కెనాల్‌లోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు..

సమాచారం అందుకున్న స్థానికులతో పాటు బంధువులు వెంటనే కాలువ వద్దకు చేరుకుని.. గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, భర్త కాలువలో దూకి చనిపోయాడన్న వార్త తెలిసిన క్షణంలోనే భార్య సునీత తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు. పుట్టెడు దుఃఖంతో ఆమె ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. క్షణాల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో అమ్మపాలెం గ్రామం విషాద ఛాయలు నెలకొన్నాయి.  

ఈ విషాద ఘటనలో అత్యంత హృదయ విదారకమైన విషయం ఏమిటంటే.. ఈ దంపతులకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.. అమ్మానాన్నల ప్రేమానురాగాల నీడలో ఎదగాల్సిన ఆ చిన్నారులు.. క్షణికావేశ నిర్ణయాల వల్ల ఒకే రోజు ఇద్దరినీ కోల్పోయి రోడ్డున పడ్డట్లు అయిపోయింది.. అమ్మానాన్న ఎక్కడికెళ్లారు? అంటూ వారు అమాయకంగా అడుగుతున్న తీరు అక్కడున్న ప్రతి ఒక్కరి చేత కన్నీరు పెట్టించింది. వారి భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

ఘటనపై సమాచారం అందుకున్న కొణిజర్ల పోలీసులు వెంటనే రంగంలోకి దిగిన్నట్లు తెలుస్తోంది.. సునీత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు సాగర్ కెనాల్‌లో హరిప్రసాద్ మృతదేహం కోసం గాలింపు ముమ్మరం చేసిన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దంపతుల ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలపై సమగ్ర దర్యాప్తు మొదలుపెట్టారు.

ఇది కూడా చదవండి..: అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి...

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

Add Zee News as a Preferred Source

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES