SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

KTR Comments: పోలీస్ స్టేషన్‌లో దాడికి ప్రయత్నించింది గూండాలా? పోలీసులా?: కేటీఆర్‌

KT Rama Rao Reacts On Congress Goons Attack: కాంగ్రెస్‌ గూండాలు పోలీస్‌ స్టేషన్‌లోనే దాడులకు తెగబడడంతో తెలంగాణలో ఘోరమైన పరిస్థితి ఉందని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌ పార్టీ) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తాము కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.

Reported By Ravi Kumar Sargam Written By Ravi Kumar Sargam
Published: Sep 15, 2026, 12:29 PM IST | Updated: Sep 15, 2026, 12:34 PM IST
Image Credit: KTR Comments In Delhi
Join

Congress Goons Attack: తన పీఆర్ఓ మహేశ్‌ ముదిరాజ్, పీఏ మహేందర్ రెడ్డిలపై పోలీస్ స్టేషన్ లోపల జరిగిన దాడిపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ స్పందించారు. 'కేసీఆర్‌పై, తెలంగాణ సాధించిన కేసీఆర్‌పై.. రెండుసార్లు ముఖ్యమంత్రిగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక సీనియర్ నాయకుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌ ఇంటి మీద దాడి జరిగింది. ప్రాణాలకు లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడిన నాయకుడి ఇంటిపైన దాడి జరిగింది' అని మాజీ మంత్రి కేటీఆర్‌ వివరించారు.

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అక్కడ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'కేసీఆర్‌ ఇంటిపై కాంగ్రెస్‌ మూకాలు, రౌడీల దాడిని ఆపడానికి మేము వెళ్తే మమ్మల్ని పోలీస్ స్టేషన్‌లో పెడితే మా మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నించారు. నిన్న మళ్లీ పోలీస్ స్టేషన్ లోపల నా పీఆర్‌ఓ, పీఏని ఇద్దరిని పోలీస్ స్టేషన్ లోపలనే 15 మందితో దాడికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నించింది' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో దాడికి ప్రయత్నించింది గూండాలా? పోలీసులా? మఫ్టీలో వచ్చి దాడి చేసిన వారు ఎవరో తేలాలని డిమాండ్‌ చేశారు.

'మా వారిపై జరిగిన దాడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమంటే కూడా చేయలేదు. తెలంగాణలో పోలీస్ శాఖ కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువగా పని చేస్తుంది' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో దాడులకు తెగబడిన కాంగ్రెస్‌ గూండాలకు పోలీసులు మద్దతు ఇచ్చి ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయడం లేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఐదు గంటల పాటు ఉన్నా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలిపారు. అయినా కూడా పోలీసులు కాంగ్రెస్‌ గూండాలపై కేసులు నమోదు చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

'ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేని ఘోరమైన పరిస్థితి తెలంగాణలో ఉంది. ఈ అంశంలో కోర్టులను ఆశ్రయిస్తాం. కోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నిరాశ నిస్పృహల్లో ఉందని.. అందులో భాగంగానే ప్రతిరోజు అటెన్షన్ డైవర్షన్‌కి పాల్పడుతోందని ఆరోపించారు. వెయ్యి రోజుల తర్వాత మేము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఈ దాడులకు తెగబడుతున్నదని రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES