• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Kumari Aunty: సోషల్ మీడియా నా కొంప ముంచింది.. డైలీ సంపాదన ఎంతో చెప్పిన కుమారీ ఆంటీ..

Kumari Aunty: సోషల్ మీడియా నా కొంప ముంచింది.. డైలీ సంపాదన ఎంతో చెప్పిన కుమారీ ఆంటీ..

Hyderabad kumari aunty: తాను సోషల్ మీడియాలో వైరల్ కాకముందే తన వ్యాపారం బాగా ఉండేదని, ఫెమస్ అయ్యాక చాలా కష్టాలు ఎదుర్కొన్నట్లు కుమారీ ఆంటీ చెప్పుకొచ్చింది.

Written ByInamdar Paresh
Published: Sep 23, 2026, 03:47 PM IST|Updated: Sep 23, 2026, 03:52 PM IST
joinshare
Kumari Aunty: సోషల్ మీడియా నా కొంప ముంచింది.. డైలీ సంపాదన ఎంతో చెప్పిన కుమారీ ఆంటీ..
Image Credit: Kumariaunty(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Kumari aunty reveals her daily income with curry stall in Hyderabad: హైదరాబాద్ లో కర్రీస్ ఫెమ్ కుమారీ ఆంటీ మరోసారి వార్తలలో నిలిచారు. ముఖ్యంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కుమారీ ఆంటీ గతంలో.. మీది మొత్తం 1000 అయింది.. రెండు లివర్లు ఎక్స్‌ట్రా' అనే ఒక్క మాటతో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ గా మారి ఫెమస్ అయిన విషయం తెలిసిందే. మరోవైపు కుమారీ ఆంటీస్టాల్ ను రోడ్డుపక్క నుంచి తొలగించాలని పోలీసులు ఆదేశించారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో కుమారీ ఆంటీకి  మరల బిజినెస్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

 మరోవైపు కుమారీ ఆంటీని చాలా మంది నిరుద్యోగులు కలిసి సీఎం రేవంత్ కు జాబ్ నోటిఫికేషన్లు, వయసును పెంచాలని కోరాలని ఆమె స్టాల్ చుట్టు తిరిగారు. ఆమెను దాదాపు అన్ని మీడియా ఛానెల్ లు కూడా కవర్ చేసిన విషయం తెలిసిందే.అయితే.. సోషల్ మీడియాలో ఫెమస్ అయ్యాక.. తన బిజినెస్ అంతా పడిపోయిందని కుమారీ ఆంటీ ఇటీవల ఒక ఛానెల్ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది.

గతంలో తన హోటల్‌కు రోజుకు 1500 మంది వరకు వచ్చేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 1000కి తగ్గిందని కుమారి ఆంటీ తెలిపారు.  అంతే కాకుండా.. గతంలో కేజీ చికెన్ రూ.140 ఉంటే, ఇప్పుడు రూ.350 అయిందని చెప్పుకొచ్చింది. బియ్యం బస్తా కూడా రూ.1000 నుంచి రూ.1800కి పెరిగిందని వాపోయింది. 

దీంతో తనకు ముందులా లాభాలు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో  హైదరాబాద్ రాకముందు తన సొంత గ్రామంలో రోజుకు రూ.50 కూలీకి పొలం పనులకు వెళ్లానని, ఏదైనా సాధించాలనే తపనతో 2011లో హైదరాబాద్ వచ్చి ఈ హోటల్ ప్రారంభించానని కుమారీ ఆంటీ చెప్పిన విషయం తెలిసిందే. 

తన దృష్టిలో సీఎంరేవంత్ రెడ్డి దేవుడని, మనసున్న మారాజు అని కుమారి ఆంటీ భావోద్వేగంగా చెప్పారు. ప్రస్తుతం తన అభిమానుల కోసం 7 సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు  చెప్పారు. బిగ్ బాస్ కు ఆఫర్ వస్తే వెళ్తానని అన్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Telugu News