SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తెలంగాణలో చలి పంజా.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

Low Temparatures at Telangana: తెలంగాణలో చలి తీవ్రత అంతకంతకు పెరుగుతూ పోతుంది. మొత్తంగా ఉత్తర తెలంగాణలో ఈ ఎఫెక్ట్‌ ఎక్కువగా ఉంది. అటు దక్షిణ తెలంగాణలో చలి తీవ్రత తక్కువగా ఉన్నా.. రాను రాను ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదు అయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 22, 2026, 10:57 IST | Updated: Nov 22, 2026, 14:03 IST
Image Credit: Cold Waves (Source/ZEE News)
Join

Cold Wave in Telangana: తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. సంగారెడ్డి జిల్లా కోహిర్, సత్వార్ లో అత్యల్పంగా తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది.మరోవైపు ఉదయం నుంచే దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో గ్రామాలు, రహదారులు మంచు తెరల మాటున కనిపించకుండా పోతున్నాయి. పొగ మంచు కారణంగా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు  సూచిస్తున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. ఉదయం 6 నుంచి 7.30 మధ్య పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంది.

కశ్మీర్ ను తలపిస్తున్న తెలంగాణలోని పలు ప్రాంతాలు.. 

ముఖ్యంగా జాతీయ రహదారి 65 చుట్టు పక్కన ప్రాంతాలు, పరిసర గ్రామాలు కాశ్మీర్ లోయను తలపిస్తున్నాయి. ఎదురుగా ఉన్న చెట్లు, సెల్ టవర్లు సైతం కనిపించనంతగా మంచు కురుస్తుండటంతో ఈ ప్రాంతం ఓ పర్యాటక ప్రదేశంలా మారిపోయింది. ఈ అద్భుతమైన దృశ్యాలను చూస్తూ స్థానిక ప్రజలు ఒకవైపు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పొగమంచు అత్యధికం.. 

అయితే మరోవైపు పెరుగుతున్న చలి తీవ్రత, పొగమంచు కారణంగా శ్వాసకోశ వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయేమోనని కొంతమంది ఆందోళన చెందుతున్నారు. వాహనదారులు సైతం లైట్లు వేసుకుని జాగ్రత్తగా ప్రయాణాలు సాగిస్తున్నారు.అంతేకాదు మరోవైపు చలి కారణంగా పిల్లలు, వృద్దులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏదైనా అత్యవసరం అయి బయటకు వెళ్లాల్సిన వాళ్లు స్వెట్టర్లు మఫ్లర్లు ధరించాలిన సూచిస్తున్నారు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES