• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Students Organic Farming: సర్కారు బడిలో చదువు.. తోటలో వ్యవసాయం.. ఆదర్శంగా ఫత్తేపూర్ స్కూల్..!

Students Organic Farming: సర్కారు బడిలో చదువు.. తోటలో వ్యవసాయం.. ఆదర్శంగా ఫత్తేపూర్ స్కూల్..!

Students Organic Farming: ప్రభుత్వ బడి' ఈ పేరు వినగానే.. టీచర్లు సరిగా రారు.. పాఠాలు చెప్పరు.. చదువు అస్సలు సాగదు అనుకుంటాం. అందుకే చాలామంది ప్రైవేటు స్కూల్స్ వైపు పరుగులు తీస్తున్నారు. కానీ, మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఆ సర్కారు బడి కథ ముమ్మాటికీ వేరు! అక్కడ ఉపాధ్యాయులు కేవలం పుస్తకాల్లోని పాఠాలు మాత్రమే చెప్పడం లేదు... విద్యార్థులతో కలిసి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఇంతకీ ఆ స్పెషల్ స్కూల్ ఎక్కడుంది..? అక్కడి పిల్లలు పండిస్తున్న పంటలేంటి? జీ తెలుగు న్యూస్ స్పెషల్.

Written ByAshok Krindinti
Published: Sep 30, 2026, 04:18 PM IST|Updated: Sep 30, 2026, 04:23 PM IST
joinshare
Students Organic Farming: సర్కారు బడిలో చదువు.. తోటలో వ్యవసాయం.. ఆదర్శంగా ఫత్తేపూర్ స్కూల్..!
Image Credit: Organic Farming

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Students Organic Farming: సాధారణంగా ఏ బడిలోనైనా చదువు, పరీక్షలు, ఆటలు మాత్రమే ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలల పట్ల సమాజంలో ఉన్న అపోహలను తిప్పికొడుతోంది మహబూబ్‌నగర్ రూరల్ మండలం ఫత్తేపూర్ గ్రామంలోని ZP ఉన్నత పాఠశాల. ఇక్కడ చదివే 153 మంది విద్యార్థులకు చదువుతో పాటు వ్యవసాయంపై కూడా పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో గత మూడేళ్లుగా విద్యార్థులే స్వయంగా తమ బడి ఆవరణలో బీర, వంకాయ, టమాట, పచ్చిమిర్చి వంటి కూరగాయలను సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారు."

పాఠశాల ఆవరణలో పండిన  తాజా కూరగాయలను పిల్లలకు  మధ్యాహ్న భోజనంలోనే ఉపయోగిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులకు పోషకాహారం అందడమే కాకుండా... చిన్నతనంలోనే రైతుల కష్టనష్టాల గుర్తించి తెలుస్తోందని ప్రధానోపాధ్యాయురాలు వెంకటమ్మ గర్వంగా చెబుతున్నారు. అంతేకాదు.. ఈ బడిలో ఒక మంచి ఆనవాయితి కొనసాగుతోంది! సాధారణంగా పుట్టినరోజు నాడు చాక్లెట్లు పంచడం అలవాటు. కానీ ఇక్కడి పిల్లలు చాక్లెట్లకు స్వస్తి చెప్పారు! ప్రతి విద్యార్థి తన పుట్టినరోజున బడికి ఒక పూలమొక్క, కుండీ తీసుకెళ్లి నాటుతారు. ఆ మొక్కలపై విద్యార్థుల పేర్లు రాసి ఉంచుతారు. దీనివల్ల బడి పచ్చదనంతో కళకళలాడటమే కాకుండా...తమ జ్ఞాపకాలు ఎప్పటికీ బడిలో నిలిచిపోతాయని పిల్లలు సంతోషంగా చెబుతున్నారు.

ఫత్తేపూర్ పాఠశాల ఆవరణ అంతా ఇప్పుడు కూరగాయలు, పూలతోటలతో పచ్చని వనంలా కనువిందు చేస్తోంది. వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఈ అనుభవం భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు రాము, జగదీష్ అంటున్నారు. చేసే పనిలో కొంత నిబద్ధత, బాధ్యత ఉంటే ఏ ప్రభుత్వ బడి అయినా ఒక ఆదర్శ పాఠశాలగా మారుతుందనడానికి ఈ ఫత్తేపూర్ హైస్కూలే నిదర్శనం!. పట్టుదల ఉండాలే గానీ, ప్రభుత్వ బడుల రూపురేఖలనే మార్చవచ్చని ఫత్తేపూర్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు నిరూపించారు. ఇతర ప్రభుత్వ పాఠశాలలకు కూడా ఈ బడి ఒక ఆదర్శంగా నిలుస్తోంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telangana News