Hyderabad: పెళ్లి పేరుతో వలపువల.. ఏకంగా రూ.35 లక్షలు కాజేసిన కిలేడీ.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్..
Woman matrimonial fraud in Hyderabad: మూసాపేటలో నివసిస్తూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న కంచి సాయికుమార్ (28)కు ఇటీవల మ్యాట్రిమోనీ సైట్ లో యువతి పరిచయం అయ్యింది. క్రమంలో అతడ్ని ప్రేమ ఆతర్వాత పెళ్లి పేరిట బుట్టలోకి వేసుకుంది.
Man cheated by girl on matrimonial site in Hyderabad: ఇటీవల చాలా మంది యువతీ, యువకులు పెళ్లిళ్లు కాక మ్యాట్రిమోనియల్ సైట్ లలో సరైన మ్యాచ్ కోసం తెగ వెతుకున్నారు. దీంతో ఇదే అదనుగా భావించిన కొంత మంది సైబర్ కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరతీశారు. ఈ క్రమంలో తరచుగా సోషల్ మీడియాలో కొంత మంది ఫెక్ ప్రొఫైల్స్ లను క్రియేట్ చేస్తున్నారు.ఆ తర్వాత అవతలి వారిని అమ్మాయిల డీపీలు పెట్టుకుని ముగ్గులోకి లాగుతున్నారు. వీరి గాలంలో పడిన వారితో తొలుత కూల్ గా మాట్లాడి ఆతర్వాత ప్రేమ, మెల్లగా కాల్స్, వీడియో కాల్స్ క్రమ క్రమంగా న్యూడ్ కాల్స్ అంటూ వారిని రెచ్చగొడుతున్నారు.
ఆ తర్వాత వారి అసలు రంగును బైటపెడుతున్నారు. మరికొంత మంది మ్యాట్రిమోనియల్ సైట్లలో తమతో పరిచయం అయిన వారితో లాభాలు వస్తాయని వివిధ సైట్లలో డబ్బులు పెట్టించి ఆ తర్వాత మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ లోని మూసాపేట్ లో ఈ తరహ మోసం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని మూసాపేట్ లో కంచి సాయికుమార్ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అతను పెళ్లి కోసం మ్యాట్రిమోనియల్ సైట్ లో తన ప్రొఫైల్ ను అడ్ డెట్ చేశాడు. ఈ క్రమంలో అతనికి అడపా కీర్తి అనే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి ఇద్దరు తరచుగా మాట్లాడుకునేవారు. ఆ యువతి పూర్తిగా తన బుట్టలో సాయికుమార్ ను వేసుకుంది.
పెళ్లి ఖర్చుల కోసం తాను సూచించిన సంస్థల్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని యువతి మాయ మాటలు చెప్పింది. మొదట రూ.50 వేలు పెట్టుబడి పెట్టగా రూ.8 వేల లాభం వచ్చినట్లు చూపించింది. అదే విధంగా.. రూ.లక్ష పెట్టుబడికి రూ.80 వేల లాభం వచ్చినట్లు చూపించడంతో సాయికుమార్ ఆమె మాటల్ని పూర్తిగా నమ్మాడు. దీంతో విడతలవారీగా మొత్తం రూ.34,22,866 పెట్టుబడి పెట్టాడు.
అయితే.. ఇటీవల పెట్టుబడులపై వచ్చిన లాభాలను విత్‌డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో యువతిని నిలదీశాడు. ఆతర్వాత ఆమె నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించాడు. వెంటనే బాధితుడు స్థానికంగా ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన వార్తలలో నిలిచింది.