Vemulawada: వినాయకుడి మెడలో నుంచి నోట్ల దండ మాయం.. దొంగకు బిగ్ షాక్ ఇచ్చిన వేముల వాడ యూత్ యువకులు.. ఏంచేశారంటే..?
Ganesh idol notes garland theft in vemulawada: బద్దిపోచమ్మ వీధిలోని వినాయకుడి విగ్రహం వద్ద వినాయకుడి వద్ద అలంకరించిన భారీ నోట్ల దండను ఒక వ్యక్తి చోరి చెద్దామని అక్కడకు వచ్చాడు. అతను చుట్టుపక్కల ఎవరైన ఉన్నారా అని అటు ఇటు చూశాడు. వెంటనే నోట్లను తెంచేసి అక్కడి నుంచి పరారయ్యాడు. వేములవాడలో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.
Man steals rs 500 currency garland from ganesh idol in vemulawada: తెలంగాణలోని రాజన్న సిరిసిల్లా గణేషుడి ఉత్సవాల్లో అనుకొని ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా మండాపాలలో గణపయ్యలను ప్రతిష్టాపన చేసుకుని చాలా మంది భక్తితో పూజలు చేసుకుంటున్నారు. కొంత మంది చేతిలో లడ్డులు, మెడలో నోట్ల కట్టల మాలలు వేసి తమ భక్తిని చాటుకున్నారు. వెరైటీ డెకొరేషన్ లు కూడా చేస్తున్నారు. అయితే.. కొంత మంది నోట్ల దండలపై కన్నేసి మరీ చోరీలకు పాల్పడుతున్నారు. అచ్చం ఈ కోవకు చెందిన ఘటన రాజన్న సిరిసిల్లాలో చోటు చేసుకుంది
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఒక గణపయ్య మండపలో చోరీ జరిగింది. బద్దిపోచమ్మ వీధిలోని వినాయకుడి విగ్రహం వద్ద జరిగిన ఈ ఘటన వార్తలలో నిలిచింది. జీవైసీ యూత్ ఆధ్వర్యంలో వినాయకుడికి 500 రూపాయల నోట్లతో రూ.50 వేల విలువైన దండను అలంకరించారు. ప్రతిరోజు దానికి యూత్ సభ్యులు ఒక కంట కనిపెడుతూ ఉండేవారు. అయితే.. ఇటీవల
తెల్లవారుజామున అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. అతని ప్రవర్తన అనుమానస్పదంగా ఉంది. అతను యూత్ సభ్యుల కళ్లు కప్పి గణపయ్య మెడలో ఉన్న నోట్ల దండను తెంచేసి వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. అతని వాలకంను అప్పటికే గమనించిన యూత్ సభ్యులు అతడిని వెంబడించారు.
కొంతదూరం వెళ్లిన తర్వాత ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ది చేశారు. మరల వినాయకుడి నోట్ల దండను తీసుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నోట్ల దండను కూడా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ఘటనపై విచారణ చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.