• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • / సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి.. ఎందుకో తెలుసా?

సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి.. ఎందుకో తెలుసా?

Manuguru Singareni Mines News: ఇటీవలే మణుగూరు సింగరేణి ఏరియాలో భారీ వర్షాలు కురవడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షం నీరు వచ్చి గనుల్లో చేరడంతో పూర్తిగా తవ్వకాలు ఆపేసిన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఎప్పటి నుంచి మళ్లీ తవ్వకాలు ప్రారంభమవుతాయో ఇప్పుడు తెలుసుకోండి..

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Sep 25, 2026, 03:20 PM IST|Updated: Sep 25, 2026, 03:22 PM IST
joinshare
 సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి.. ఎందుకో తెలుసా?
Image Credit: జీ తెలుగు న్యూస్..

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Manuguru Singareni Mines Telugu News: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి ఏరియాలో విపరీతంగా పడిన వర్షం బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దాదాపు రెండు నుంచి మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు జలమయమయ్యాయి.. మణుగూరు పరిసరి ప్రాంతాల్లో ఏకంగా 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో గనుల్లో భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరంది. ఫలితంగా అటు బొగ్గు వెలికితీయడతో పాటు ఓవర్‌బర్డెన్ ఓబీ తొలగింపులను తీవ్ర ఆటంకం ఏర్పడింది.

మణుగూరు ఏరియాలో ఉన్న ఓపెన్ కాస్ట్ గనుల నుంచి సాధారణ రోజుల్లో రోజుకు 24 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధికారులు లక్ష్యంగా చేసుకుని బొగ్గును తీస్తూ ఉంటారు.. అయితే, అకస్మాత్తుగా కురిసిన వర్షాల వల్ల గనుల్లోని పని చేసే చోట్లు అన్ని బురదమయంగా మారడంతో ప్రధాన క్వారీల్లో నీరు నిలవడం, యంత్రాల కదలిక పూర్తి ఆగిపోయాయి... దీంతో కేవలం 20 వేల టన్నుల బొగ్గును మాత్రమే వెలికితీయగలిగారని అధికారులు వెల్లడించారు. వర్ష ప్రభావంతో దాదాపు 4 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి తక్షణమే గండి పడిన్నట్లు తెలుస్తోంది..

బొగ్గు వెలికి తీసేందుకు.. అత్యంత కీలకమైన మట్టి తొలగింపు ప్రక్రియ వర్షం కారణంగా పూర్తిగా స్తభించిపోయిన్నట్లు తెలుస్తోంది.. మణుగూరు ఏరియాలో ప్రతిరోజూ సుమారు 1.85 లక్షల టన్నుల మట్టిని తొలగించాల్సి ఉండగా.. వరద ప్రవాహం కారణంగా భారీ డంపర్లతో పాటు భారీ ఎక్స్‌కవేటర్లు, షవెల్స్ కదలలేని పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షం కారణంగా రోడ్లు జారుడుబండలుగా మారడంతో కార్మికుల భద్రత దృష్ట్యా రవాణా.. ఆఫ్‌లోడింగ్ పనులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

గనుల్లోకి నిలిపోయిన వర్షపు నీటిని బయటకు పంపేందుకు సింగరేణి యంత్రాంగం యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.. గనుల అడుగు భాగంలో నిలిచిన లక్షలాది లీటర్ల వరద నీటిని బయటకు తోడేందుకు ప్రత్యేకంగా హై-కెపాసిటీ మోటార్లతో పాటు డీజిల్ పంపులను అమర్చిన్నట్లు అధికారులు వెల్లడించారు.. నీటిని యుద్ధప్రాతిపదికన తొలగిస్తూ.. బురదను సరిచేసి గనుల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ఇంజనీర్లు, కార్మికులు శ్రమిస్తున్నారట.. వర్షం పూర్తిగా తగ్గుముఖం పట్టి.. నీటి తోడివేత పూర్తయిన తర్వాతే ఉత్పత్తి పనులు పూర్తి స్థాయిలో ఊపందుకుంటాయని గని అధికారులు తెలిపారు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News