తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో నవంబర్ 5న మెగా పీటీఎం.. విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు..!!
Mega Parent-Teacher Meeting: తెలంగాణ రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో విద్యార్థుల విద్య ప్రమాణాలను మరింత మెరుగుపర్చడమే లక్ష్యంగా విద్యాశాఖ పలు కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా రాష్ట్రం వ్యాప్తంగా ఈనెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సమ్మేటివ్ అసెస్మెంట్ -1 పరీక్షలను నిర్వహించారు
Mega Parent-Teacher Meeting: తెలంగాణ రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో విద్యార్థుల విద్య ప్రమాణాలను మరింత మెరుగుపర్చడమే లక్ష్యంగా విద్యాశాఖ పలు కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా రాష్ట్రం వ్యాప్తంగా ఈనెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సమ్మేటివ్ అసెస్మెంట్ -1 పరీక్షలను నిర్వహించారు.
ఈ విద్యా ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు.. విద్యా ప్రమాణాలను కచ్చితంగా అంచనా వేసేందుకు కొన్ని జిల్లాల్లోని ఎంపిక చేసిన బడుల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఎక్స్ టర్నల్ ఎవల్యూషన్ చేపట్టింది.
అయితే ఈ ప్రక్రియలో భాగంగా బయట పాఠశాలల టీచర్లతో పేపర్లను దిద్దించారు. అయితే ఈ పరీక్ష ఫలితాలు ఎలా ఉన్నాయి.. సరిదిద్దాల్సిన లోపాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలపై అధికారులు ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది.
అందుకోసం సమ్మేటివ్ అసెస్మెంట్ 1 పరీక్షల ఫలితాల ఆధారంగా నవంబర్ 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ డైరెక్ట్ నవీన్ నికోలస్ ఈ ఆదేశాలను జారీ చేశారు.
ఈనెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఏ1 పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా విద్యార్థులు సాధించిన మార్కులను నవంబర్ 5వ తేదీ లోపు ఆన్ లైన్ ఖచ్చితంగా నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది.
Also Read: