• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /మోదీ దీపావళి గిఫ్ట్ రూ. 8 వేల ఆఫర్ నిజమేనా? వాట్సాప్‌లో ఆ లింక్ వస్తే బీ అలర్ట్..!!

మోదీ దీపావళి గిఫ్ట్ రూ. 8 వేల ఆఫర్ నిజమేనా? వాట్సాప్‌లో ఆ లింక్ వస్తే బీ అలర్ట్..!!

Modi Diwali Gift Scam: పండుగ వేళ సైబర్ కేటుగాళ్లు అమాయకులను బురిడీ కొట్టించేందుకు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరుతో దీపావళి కానుక కింద ఉచితంగా రూ. 8,000 నగదు అందిస్తున్నామంటూ వాట్సాప్.. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కొద్ది రోజులుగా కొన్ని సందేశాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Written ByBhoomi
Published: Oct 30, 2026, 09:16 AM IST|Updated: Oct 30, 2026, 09:19 AM IST
joinshare
మోదీ దీపావళి గిఫ్ట్ రూ. 8 వేల ఆఫర్ నిజమేనా? వాట్సాప్‌లో ఆ లింక్ వస్తే బీ అలర్ట్..!!
Image Credit: Diwali Gift Scam

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
బంగార ప్రియులకు గుడ్‌న్యూస్..  భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే..!!

బంగార ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే..!!

2

స్వాతి నక్షత్రంలో సూర్యుడి ఎఫెక్ట్‌.. వృషభం సహా 4 రాశులకు పట్టిందల్లా బంగారమే!

3

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో నవంబర్ 5న మెగా పీటీఎం.. విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు..!!

4

సింహరాశిలోకి కుజుడు ఎంట్రీ.. ఈ రాశులవారికి ఉద్యోగం, వ్యాపారాల్లో భారీ లాభాలు!

5

మోదీ దీపావళి గిఫ్ట్ రూ. 8 వేల ఆఫర్ నిజమేనా? వాట్సాప్‌లో ఆ లింక్ వస్తే బీ అలర్ట్..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Modi Diwali Gift Scam: పండుగ వేళ సైబర్ కేటుగాళ్లు అమాయకులను బురిడీ కొట్టించేందుకు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరుతో దీపావళి కానుక కింద ఉచితంగా రూ. 8,000 నగదు అందిస్తున్నామంటూ వాట్సాప్.. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కొద్ది రోజులుగా కొన్ని సందేశాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వైరల్ మెసేజ్‌లపై సైబర్ క్రైమ్ పోలీసులు తీవ్రంగా స్పందిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ అనుమానాస్పద లింక్స్ ద్వారా వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను దొంగలించే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఓటీపీ, యూపీఐ పిన్, పాస్ వర్డ్ లను గుర్తుతెలియని వెబ్ సైట్లలో నమోదు చేయకూడదని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. ప్రభుత్వ స్కీమ్ అని చెప్పే మెసేజ్ లను అధికారిక వనరుల ద్వారా ధ్రువీకరించుకోవాలని కోరారు. సైబర్ మోసానికి గురైనట్లయితే వెంటనే 1930 హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.

దీపావళికి ఉచితంగా రూ.8,000 ఇస్తున్నట్లు వాట్సాప్ సందేశం:

దీపావళికి ఉచితంగా రూ.8,000 ఇస్తున్నట్లు వాట్సాప్ సందేశం మీకు వచ్చిందా? అయితే అప్రమత్తంగా ఉండండి. సైబర్ నేరగాళ్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరుతో  ఒక కేంద్ర ప్రభుత్వ పథకం పేరును ఉపయోగించి ఒక కొత్త మోసానికి తెరలేపారు. ప్రతి పౌరుడికి దీపావళి కానుకగా రూ.8,000 ఇస్తున్నట్లు నకిలీ సందేశాలు పంపిస్తున్నారు.  వాటిలో అందించిన లింక్‌పై క్లిక్ చేసేలా ప్రజలను ఆకర్షిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సైబర్ భద్రతా బ్యూరో (టీజీసీఎస్‌బీ) హెచ్చరిక జారీ చేసింది. ఇటువంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది.

కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి పౌరుడికి దీపావళి కానుకగా రూ.8,000 ఇస్తోందని సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌లో సందేశాలు  సర్క్యూలేట్ చేస్తున్నారు. ఈ మొత్తాన్ని పొందడానికి, మెసేజ్ లో అందించిన లింక్‌పై క్లిక్ చేసి, వారి వివరాలను నమోదు చేయమని వారు ప్రజలను కోరుతున్నారు. ప్రభుత్వ పథకంలా కనిపించే సందేశాలను క్రియేట్ చేసి ప్రజలను నమ్మించడానికి వారు ప్రయత్నిస్తున్నారు. అయితే, మీరు ఈ మెసేజ్ లను నమ్మి లింక్‌పై క్లిక్ చేస్తే, నకిలీ వెబ్‌సైట్ తెరుచుకునే ప్రమాదం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు.

ఆధార్ వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, మొబైల్ నంబర్, ఓటీపీ వంటి వ్యక్తిగత సమాచారం ఎంటర్ చేయమని అడుగుతారు.   ఈ వివరాలను అందిస్తే, సైబర్ నేరగాళ్లు వాటిని దుర్వినియోగం చేసి బ్యాంకు ఖాతాల నుండి డబ్బును దొంగిలించే అవకాశం ఉంది. నకిలీ లింకులు వ్యక్తిగత సమాచారానికే కాకుండా మొబైల్ ఫోన్ భద్రతకు కూడా ముప్పు కలిగించగలవని సైబర్ పోలీసులు తెలిపారు. కొన్ని అనుమానాస్పద లింకులు హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇది ఫోన్ సమాచారం.. ఆన్‌లైన్ ఖాతాల భద్రతకు ప్రమాదం కలిగిస్తుందని తెలిపారు.

యూపీఐ పిన్‌లు, బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు, ఓటీపీలను ఇతరులతో పంచుకోవడం ఆర్థిక మోసానికి దారితీసే ప్రమాదం ఉందని సైబర్ పోలీసులు తెలిపారు. అందువల్ల, ఉచిత నగదు, బహుమతులు, లేదా ప్రభుత్వ ఆర్థిక సహాయం ఇస్తామని మెసేజ్ లు వస్తే నమ్మకూడదని.. వాటిని తొందరపడి నమోదు చేయకూడదని పోలీసులు హెచ్చరించారు.

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో:

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ప్రకటన ప్రకారం, ప్రభుత్వం ప్రకటించే కొత్త పథకాలు లేదా నగదు సాయం గురించిన వార్తలను ప్రజలు కేవలం అధికారిక వెబ్‌సైట్లు.. ప్రభుత్వ ప్రకటనల ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలి. వాట్సాప్‌లో వచ్చే సందేశాలలో ప్రధాని పేరు, ప్రభుత్వ ముద్రలు లేదా పథకాల పేర్లు ఉన్నంత మాత్రాన వాటిని నిజమైనవిగా భావించి నమ్మవద్దని పోలీసులు స్పష్టం చేశారు.

అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే అనుమానాస్పద లింక్‌లను ఓపెన్ చేయకూడదని, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని సూచించారు. ముఖ్యంగా బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్, పాస్‌వర్డ్‌లను గుర్తుతెలియని సైట్లలో నమోదు చేయవద్దని, ఒకవేళ పొరపాటున లింక్ క్లిక్ చేసినా ఎలాంటి వివరాలు నింపకుండా వెంటనే ఆ పేజీ నుంచి బయటకు రావాలని తెలిపారు. అకస్మాత్తుగా నకిలీ లింక్‌ల వల్ల డబ్బులు నష్టపోతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని అధికారులు వెల్లడించారు.

Also Read: 

తులం బంగారం రూ. 2 లక్షలు కానుందా? పసిడి పరుగులు వెనుక అసలు లెక్కలు ఇవే..!!
 

Add Zee News as a Preferred Source
TAGS:
Govt Schemes
Telangana News
Telugu News