SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Konda Surekha: కుప్పిగంతలు వేస్తే ఆడొళ్లతో కొట్టిస్తా.!. కొండా సురేఖ మాస్ వార్నింగ్.. మ్యాటర్ ఏమిటంటే..?..

Konda Surekha fires on congress leaders: నా వెనుక నిలబడిన మహిళలు ఒక్కొక్కరు నలుగురిని కొడతారంటూ మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే అందరికి మంచిదని మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Written By Inamdar Paresh
Published: Sep 29, 2026, 05:00 PM IST | Updated: Sep 29, 2026, 05:05 PM IST
Image Credit: kondasurekhainwarangalmeeting
Join

Mla Konda Surekha mass warning to congress cadre leaders: తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి కొండా సురేఖ అంశంలో అనేక ట్విస్ట్ లు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ పై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో.. కాంగ్రెస్ హైకమాండ్ మంత్రి పదవి నుంచి కొండాసురేఖను బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. కొండా సుష్మిత వివాదం ఆతర్వాత ఢిల్లీ వేదికగా అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక కొన్ని రోజుల క్రితం కొండా మురళి, కొండా సురేఖ తమఅనుచరులతో వరంగల్ లో సమావేశమయ్యారు. 

 

ఈ క్రమంలో  సీఎం రేవంత్ పై, కొంత మంది కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తమకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చిందని చెప్పుకొచ్చారు. తమకు పదవులు ముఖ్యం కాదని, ప్రజలే ముఖ్యమన్నారు. ఇక పీసీపీ చీఫ్ మాత్రం కొండా సురేఖకు ఢిల్లీ నుంచి  పిలుపు రావడం తమకు తెలియదన్నారు. ఇక తాజాగా.. ఎమ్మెల్యే కొండా సురేఖ మరోసారి వరంగల్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.

 

కొండా సురేఖ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలంతా వర్గవిబేదాలు, వ్యక్తిగత వివాదాలు పక్కన పెట్టి పార్టీ బలోపేతంకు అందరు కలిసి రావాలన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో మొత్తం 24 స్థానాలకు అన్ని కూడా కైవసం చేసుకొవాలని స్పష్టం చేశారు. వరంగల్ తూర్పు నియోజక వర్గంను అన్ని రకాలుగా డెవలప్ మెంట్ చేస్తామన్నారు. 

తనను, తన అనుచరులను ఉద్దేశించి కొంత మంది ఇష్టానుసారంగా మాట్లాడే వారు నోరు అదుపులో పెట్టుకోవాలని కొండా సురేఖ వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడున్న ఒక్కో మహిళ నలుగురిని ఎదుర్కొనే సత్తా కలిగి ఉందని వ్యాఖ్యానించారు. మహిళలతో కొట్టిస్తామన్నారు. వరంగల్‌లో తన క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కొండా సురేఖ పాల్గొన్నారు. 

 ప్రతిపక్ష నేతలు గాల్లో కత్తులు తిప్పుతున్నారని ఎద్దేవాచేశారు.  కాంగ్రెస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, KUDA ఛైర్మెన్ గుండు సుధారాణికి కొండా సురేఖ ఈవేదికగా ఇన్ డైరెక్ట్ గా మాస్ వార్నింగ్ ఇచ్చారు. మొత్తంగా కొండా సురేఖ చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES