MP Dharmapuri Arvind: కేటీఆర్ గడ్డం వెనుక స్టోరీ ఇదే... అసలు విషయం బైటపెట్టిన ఎంపీ ధర్మపురి అర్వింద్ .!.
Dharmapuri arvind on ktr: కేటీఆర్ ఇటీవల సింగరేణి కార్మిక గర్జన సభలో మునుపెన్నడులేని విధంగా కొత్తగా గడ్డంతో కన్పించారు. సడెన్ గా కేటీఆర్ మాస్ లుక్ లో కన్పించడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఈ అంశంపై చేపిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
MP Dharmapuri Arvind on ktr new beard look row: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఎల్ నినో అంశం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. మరొవైపు సీఎం రేవంత్ సైతం ఎల్ నినోపై ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల రామగుండంలో జరిగిన సింగరేణి కార్మిక గర్జన సభకు హజరయ్యారు. మునుపెన్నడులేని విధంగా ఆయన సడెన్ గా గడ్డంతో మాస్ లుక్ లో కన్పించారు. దీంతో ఆయన కొత్త లుక్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై కొంత మంది సెటైర్లు వేస్తుండగా మరికొంత మంది కొత్త లుక్ బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కేటీఆర్ గడ్డంపై చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
ఎంపీ ధర్మపురి ఇటీవల తెలంగాణలో బీజేపీ నేతలు యాక్టివ్ గా లేరని వస్తున్న ఆరోపణలపై తనదైనస్టైల్ లో స్పందించారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ సునామీ కన్పిస్తుందని అన్నారు. ఏ పార్టీతో పొత్తులేకుండానే అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ధర్మపురి అర్వింద్ ఎద్దేవా చేశారు. ఈ పార్టీల మధ్యనే పొత్తులు ఉంటాయని జోస్యం చెప్పారు. ఇక సీఎం రేవంత్ పై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా ఉందన్నారు. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి పదవి పోవడం ఖాయమన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ భారీగా ప్రజల ధనంను కొల్లకొట్టిందన్నారు. సోషల్ మీడియాలో మాత్రం పెయిడ్ ప్రమోషన్లు చేయించుకుంటున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ స్వయం అపరాధాల వల్ల కనుమరుగవుతుందని అన్నారు. బీఆర్ఎస్ ను కూడా ప్రజలు ఓడిస్తారని చెప్పుకొచ్చారు.
కేటీఆర్ గడ్డంపై సెటైర్లు..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గడ్డంపై ఎంపీ ధర్వపురి అర్వింద్ సెటైర్లు వేశారు. గడ్డం పెంచితే సీఎం అవుతారని ఎవరో చెప్పారంటూ , అందుకే కేటీఆర్ గడ్డం పెంచుతున్నారంటూ సెటైర్లు వేశారు. ఇక కేటీఆర్ కుటుంబంలో పాటించే సెంటిమెంట్ లపై ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు.
పాత సచివాలంయను కూలగొట్టి.. వాస్తు కోసం ప్రజాధనంను వెస్ట్ చేసి కొత్త సచివాలయం కట్టారంటూ ఎంపీ అర్వింద్ గుర్తు చేశారు. ఇక గతంలో ఉత్తమ్ కుమార్ సైతం కాంగ్రెస్ గెలిచే వరకు గడ్డం తీయనని పెంచిన విషయంపై మాట్లాడారు. ఏదో అనుకొకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పంచ్ లు వేశారు. అదే విధంగా కేటీఆర్ గడ్డం పెరుగుతుందేమో కానీ ఆయన సీఎం కావడం మాత్రం కల్ల అంటూ ఎంపీ అర్వింద్ పంచ్ లు వేశారు.