SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Jagtial: జగిత్యాలలో గణేష్ లడ్డూ వేలం.. ముస్లిం యువకుడిని ప్రశంసిస్తున్న స్థానికులు.. అసలు విషయం ఏమిటంటే.?..

Ganesh laddu auction in Jagtial: జగిత్యాల పట్టణం గోవిందుపల్లె టీం సెవెన్‌ యూత్‌ గణేశ్‌ మండపంలో మహ్మద్ ఇషాన్ వేలం పాటలో పాల్గొనడమే కాకుండా ఏకంగా లడ్డును సైతం గెల్చుకున్నాడు. ఈ క్రమంలో స్థానికులు సదరు బాలుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Written By Inamdar Paresh
Published: Sep 25, 2026, 05:00 PM IST | Updated: Sep 25, 2026, 05:09 PM IST
Image Credit: muslimboywinsganeshladduinjagtial
Join

Muslim youth Devotee wins Ganesh laddu in auction in Jagtial: తెలంగాణలో వినాయక నిమజ్జనం ఎంతో ఉల్లాసంగా జరుగుతుంది. గణపయ్య విగ్రహాలను మండపాల నుంచి ప్రత్యేక వాహనాల్లో యూత్ సభ్యులు నెమ్మదిగా గంగమ్మ ఓడికి తరలిస్తున్నారు. పోలీసులు సైతం వినాయక నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మరోవైపు వినాయక నిమజ్జనంలో పలు చోట్ల అరుదైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా చోట్ల భిన్నత్వంలో ఏకత్వంను చాటుకుంటున్నారు. వినాయకుడి ఉత్సవాలలో ముస్లిం కుటుంబాలు కూడా పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో జగిత్యాలలో గణేషుడి లడ్డు వేలంపాటలో ఒక ముస్లిం యువకుడు పాల్గొన్నాడు.


జగిత్యాల పట్టణంలోని గోవిందుపల్లె టీం సెవెన్‌ యూత్‌ గణేశ్‌ మండపం మతసామరస్యానికి కేంద్రంగా నిలిచింది. మండపం నిర్వాహకులు  గణపతి లడ్డూను వేలంపాటను నిర్వహించారు. దీనిలో ముస్లిం యువకుడు మహ్మద్ ఇషాన్ పాల్గొన్నాడు. అయితే.. అతను అక్కడున్న వారితో పోటా పోటీగా వేలం పాట పడి మరీ వినాయకుడి లడ్డును ఏకంగా రూ.70 వేలకు పాట పాడిమరీ దక్కించుకున్నాడు. దీంతో యూత్ సభ్యులు సన్యానించి మరీ  మహ్మద్ ఇషాన్ కు లడ్డును అందజేశారు. 

సదరు బాలుడు.. గణేశ్‌నగర్‌కు చెందిన ప్రముఖ గాయకుడు ఎండీ అభి కుమారుడు . ఇషాన్ బాల్యం నుంచే స్నేహితులతో కలిసి గణేశ్‌ నవరాత్రుల్లో పాల్గొంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఏరోజు కూడా ఇషాన్ ను అడ్డుకొలేదని చెప్పుకొచ్చారు. 

ఇప్పటికే తన మిత్రులతో కలిసి వినాయకుడిని మండపంలో ఇషాన్ ప్రతిష్టించాడు. ఇక వేలంపాల పడి వినాయుడి లడ్డును దక్కించుకున్నందుకు ఎంతగానో సంతోషంగా ఉందని ఇషాన్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో స్థానికులు ఇషాన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES