SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Vemula Veeresham: ఒకే రోజు రెండు రోడ్డు ప్రమాదాలు.. తృటిలో బయటపడ్డ ఎమ్మెల్యే వేముల వీరేశం..

Nakrekal mla escaped from road accident: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంపెద్ద ప్రమాదాల నుంచి వెంట్రుక వాసిలో బైటపడ్డారు. ఈ ఘటనలపై కాంగ్రెస్ నేతల్లో కలవరం మొదలైంది.

Written By Inamdar Paresh
Published: Nov 05, 2026, 07:06 PM IST | Updated: Nov 05, 2026, 07:14 PM IST
Image Credit: veemulaveeresham (file)
Join

Mla vemula veeresham narrowly escaped from road accident: సాధారణంగా రోడ్లపై వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ నియమాల్ని పాటించాలని పోలీసులు తరచుగా చెబుతుంటారు. కానీ కొంత మంది మాత్రం ట్రాఫిక్ నియమాల్ని పూర్తిగా బేఖాతరు చేస్తారు. అంతే కాకుండా ట్రబుల్ రైడింగ్ లు చేస్తారు. తప్పతాగి వాహనాల్ని నడిపిస్తారు. రాంగ్ రూట్ లో వాహనాల్ని నడిపించి ఇతర వాహన దారులకు ఇబ్బందులకు గురిచేస్తారు.  కొన్నిసార్లు వాహనాలు సడెన్ బ్రేకులు వేయడం వల్ల లేదా వాహనాల మధ్య ఇతరులు రాంగ్ రూట్ లో వస్తే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. సామాన్యుల నుంచి వీఐపీలు, రాజకీయ నేతల వరకు ఈ విధంగా జరిగిన కొన్ని ఘటనల్లో రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు.    ఈ క్రమంలో తాజాగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఒకే రోజులో రెండు ప్రమాదాలకు గురయ్యారు.

 

 

 ఈ ఘటనతో కాంగ్రెస్ శ్రేణులు  ఒక్కసారిగా టెన్షన్ కు గురయ్యారు. ప్రభుత్వ విప్ , నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఒకే రోజు రెండు రోడ్డు ప్రమాదాల నుంచి బైటపడ్డారు. నకిరేకల్ నుంచి చిట్యాల వెళ్తుండగా వీరేశం ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన  కార్నివాల్ కారు బలంగా ఢీకొట్టింది. దీంతో వేముల వీరేశం కారు కాస్త కాన్వాయ్ లో ఉన్న ఇతర వాహనాల్ని ఢీకొట్టింది. దీంతో కారు కాస్త ధ్వంసమైంది. 

మరల  మరో వాహనంలోకి ఎక్కి వెళ్తుండగా చిట్యాల నుంచి తుంగతుర్తికి వెళ్తుండగా క్రిస్టా కారును లారీ ఢీకొట్టింది. దీంతో మరోసారి ఆయన ప్రమాదంకు గురయ్యారు. అప్పుడుకూడా వేముల వీరేశం డ్రైవర్ అప్రమత్తంగా ప్రవర్తించడంతో బైటపడ్డారు. ఈ క్రమంలో ఒకే రోజు వేముల వీరేశం రెండు వరుస ప్రమాదాలకు గురికావడంతో కాంగ్రెస్ శ్రేణులు టెన్షన్ కు గురయ్యారు. మరోవైపు ఆయనకు ఫోన్ చేసి క్షేమసమాచారంను అడిగి తెలుసుకుంటున్నారు. కార్యకర్తలు సైతం తమ నేత ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES