• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /Cristiano Ronaldo: ఫుట్‌బాల్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. క్రిస్టియానో రొనాల్డో రిటైర్‌మెంట్ ప్రకటన

Cristiano Ronaldo: ఫుట్‌బాల్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. క్రిస్టియానో రొనాల్డో రిటైర్‌మెంట్ ప్రకటన

Cristiano Ronaldo Retirement: ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పోర్చుగల్ జాతీయ జట్టుకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. 23 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 234 మ్యాచ్‌లు ఆడిన రొనాల్డో.. 146 గోల్స్‌తో చరిత్ర సృష్టించాడు.

Written ByAshok Krindinti
Published: Nov 05, 2026, 05:54 PM IST|Updated: Nov 05, 2026, 05:56 PM IST
joinshare
Cristiano Ronaldo: ఫుట్‌బాల్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. క్రిస్టియానో రొనాల్డో రిటైర్‌మెంట్ ప్రకటన
Image Credit: Cristiano Ronaldo Retirement (Instagram)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Cristiano Ronaldo: ఫుట్‌బాల్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. క్రిస్టియానో రొనాల్డో రిటైర్‌మెంట్ ప్రకటన

Cristiano Ronaldo: ఫుట్‌బాల్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. క్రిస్టియానో రొనాల్డో రిటైర్‌మెంట్ ప్రకటన

2

యాపిల్ అభిమానులకు గుడ్ న్యూస్.. జనవరిలోనే iPhone 18 విడుదల? ఫీచర్లు లీక్‌..

3

Ragina Cassandra: నచ్చకుంటే తప్పుకొవచ్చు.. రాధికా ఆప్టే కామెంట్స్ కు ఇచ్చిపడేసిన రెజీనా కసాండ్రా.. ఇండస్ట్రీలో రచ్చ..

4

YS Jagan: ఎన్నికల వ్యవస్థను చంద్రబాబు గుప్పిట్లోకి తీసుకుని నడిపించాడు: వైఎస్‌ జగన్‌

5

IPL 2027: ఐపీఎల్‌ 2027లో కీలక పరిణామం.. ప్లేయర్లను ఇచ్చిపుచ్చుకున్న చెన్నై, హైదరాబాద్

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Cristiano Ronaldo Retirement: ఫుట్‌బాల్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్. ఫుట్‌బాల్ దిగ్గజం, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న క్రిస్టియానో రొనాల్డో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. సోషల్ మీడియాలో తన రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. దీంతో పోర్చుగల్ జాతీయ జట్టుతో రొనాల్డోకు ఉన్న 23 ఏళ్ల అనుబంధం ముగియనుంది. 2003 ఆగస్టులో పోర్చుగల్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన 41 ఏళ్ల రొనాల్డో.. అప్పటి నుంచి జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మైదానంలో తన ఆటతీరుతో ఎన్నో విజయాలను అందించాడు. జట్టుకు నాయకుడిగా అనేక చిరస్మరణీయ విజయాల్లో భాగమయ్యాడు. ఇప్పుడు అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలుకుతూ.. తన జెర్సీ నంబర్ 7ను తిరిగి జాతీయ జట్టుకు ఇచ్చే సమయం ఆసన్నమైందని వెల్లడించాడు.

జాతీయ జట్టు తరఫున ఇకపై తన ఐకానిక్ నంబర్ 7 జెర్సీని ధరించబోనని చెప్పాడు రొనాల్డో. పోర్చుగల్ ప్రజలను ఉద్దేశించి భావోద్వేగ సందేశాన్ని విడుదల చేశాడు. 23 ఏళ్ల పాటు ఆ జెర్సీని ధరించడం.. దేశం తరఫున మైదానంలో పోరాడటం తనకు దక్కిన గొప్ప గౌరవమన్నాడు. ఆ నంబర్ కేవలం తనది మాత్రమే కాదని.. దేశానికి చెందినదని తన సందేశంలో చెప్పుకొచ్చాడు.  2003 ఆగస్టులో మొదలైన తన ప్రయాణం.. ఇవాళ్టితో ముగిసిందని అన్నాడు.

పోర్చుగల్ తరఫున రొనాల్డో సృష్టించిన రికార్డులు అసాధారణం. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా.. అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా తన పేరును చరిత్రలో లిఖించుకున్నాడు. ఇప్పటివరకు పోర్చుగల్ తరఫున 234 మ్యాచ్‌లు ఆడి 146 గోల్స్ సాధించాడు. 2016లో పోర్చుగల్ తొలిసారి యూరోపియన్ ఛాంపియన్‌షిప్ గెలవడంలో రొనాల్డో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత 2019, 2025లో UEFA నేషన్స్ లీగ్ టైటిళ్లను కూడా అందుకున్నాడు. వ్యక్తిగతంగా ఎన్నో అవార్డులు సాధించిన అతడు.. జట్టుకు కూడా అద్భుతమైన విజయాలను అందించాడు.

రొనాల్డో కెరీర్‌లో ప్రపంచకప్‌లకు ప్రత్యేక స్థానం ఉంది. 2006 నుంచి 2026 వరకు మొత్తం ఆరు ఫిఫా ప్రపంచకప్ టోర్నీల్లో పోర్చుగల్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆరు వేర్వేరు ప్రపంచకప్ టోర్నీల్లో గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయితే ఇంతటి గొప్ప కెరీర్ ఉన్నా.. ప్రపంచకప్ ట్రోఫీని మాత్రం అందుకోలేకపోయాడు. 2026 ప్రపంచకప్‌లో స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఓడిపోవడంతో ఆ కల నెరవేరలేదు. రొనాల్డో టీమ్‌లోకి వచ్చిన తరువాత పోర్చుగల్ 2006 వరల్డ్ సెమీస్‌కు చేరుకుంది. ప్రపంచకప్‌లో పోర్చుగల్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.

తమ దేశ ఫుట్‌బాల్‌కు రొనాల్డో చేసిన సేవలను పోర్చుగల్ ఫుట్‌బాల్ సమాఖ్య ప్రత్యేకంగా గుర్తించింది. రొనాల్డో అంతర్జాతీయ కెరీర్‌కు గ్రాండ్ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపింది. అభిమానులు, దేశ ప్రజలు మరోసారి అతడి సేవలను గుర్తుచేసుకునేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించింది.

ఇదిలా ఉండగా.. ఇటీవల జాతీయ జట్టు కోచ్ జార్జ్ జీసస్‌తో రొనాల్డోకు విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. నేషన్స్ లీగ్ మ్యాచ్‌లో ఆడే అవకాశం రాకపోవడంతో జట్టు శిబిరాన్ని వీడిన వ్యవహారం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఈ ఘటన తర్వాత అతడిపై 30 రోజుల సస్పెన్షన్ వేటు కూడా పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ కెరీర్‌ గుడ్‌బై చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అయితే రొనాల్డో నిర్ణయం కేవలం పోర్చుగల్ జాతీయ జట్టుకే పరిమితం. క్లబ్ ఫుట్‌బాల్‌కు మాత్రం అతడు వీడ్కోలు పలకలేదు. ప్రస్తుతం సౌదీ అరేబియా క్లబ్ అల్ నసర్ తరఫున ఆడుతున్నాడు. 

Add Zee News as a Preferred Source
TAGS:
Sports News
Telugu News