• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /యాపిల్ అభిమానులకు గుడ్ న్యూస్.. జనవరిలోనే iPhone 18 విడుదల? ఫీచర్లు లీక్‌..

యాపిల్ అభిమానులకు గుడ్ న్యూస్.. జనవరిలోనే iPhone 18 విడుదల? ఫీచర్లు లీక్‌..

Apple iPhone 18 Leaks: త్వరలోనే యాపిల్‌ కంపెనీ తమ బడ్జెట్‌ ఐఫోన్ 18 స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ వచ్చే ఏడాది జనవరిలో లాంచ్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్లు టెక్‌ నిపుణులు తెలుపుతున్నారు. అధికారిక ప్రకటనకు ముందే ఈ స్మార్ట్‌ఫోన్‌ మోడల్‌ ఫీచర్స్ లీక్‌ అయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 05, 2026, 05:32 PM IST|Updated: Nov 05, 2026, 05:34 PM IST
joinshare
యాపిల్ అభిమానులకు గుడ్ న్యూస్.. జనవరిలోనే iPhone 18 విడుదల? ఫీచర్లు లీక్‌..
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Cristiano Ronaldo: ఫుట్‌బాల్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. క్రిస్టియానో రొనాల్డో రిటైర్‌మెంట్ ప్రకటన

Cristiano Ronaldo: ఫుట్‌బాల్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. క్రిస్టియానో రొనాల్డో రిటైర్‌మెంట్ ప్రకటన

2

యాపిల్ అభిమానులకు గుడ్ న్యూస్.. జనవరిలోనే iPhone 18 విడుదల? ఫీచర్లు లీక్‌..

3

Ragina Cassandra: నచ్చకుంటే తప్పుకొవచ్చు.. రాధికా ఆప్టే కామెంట్స్ కు ఇచ్చిపడేసిన రెజీనా కసాండ్రా.. ఇండస్ట్రీలో రచ్చ..

4

YS Jagan: ఎన్నికల వ్యవస్థను చంద్రబాబు గుప్పిట్లోకి తీసుకుని నడిపించాడు: వైఎస్‌ జగన్‌

5

IPL 2027: ఐపీఎల్‌ 2027లో కీలక పరిణామం.. ప్లేయర్లను ఇచ్చిపుచ్చుకున్న చెన్నై, హైదరాబాద్

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Apple iPhone 18 Leaks: ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ తమ ఐఫోన్‌ సిరీస్‌లో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవలే ఐఫోన్ 18 ప్రో సిరీస్ లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే.. అయితే, ఇందులో కేవలం ప్రో మోడల్స్‌ను మాత్రమే అందుబాటులోకి తీసుకు వచ్చింది. కానీ యాపిల్‌ త్వరలోనే ఐఫోన్ 18 మోడల్‌ను కూడా లాంచ్‌ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ వచ్చే ఏడాది మొదటి నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఓఎల్‌ఈడీ (OLED) డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వీబోలో తెలిపిన వివరాల ప్రకారం.. ఐఫోన్ 18 మోడల్‌లో 1.5K రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేసే 6.3-అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలిపారు.. ఇందులో యాపిల్ సొంత నెక్స్ట్-జెన్ A20 చిప్‌సెట్ వినియోగించినట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి. లుక్స్ పరంగా కంపెనీ తన ట్రేడ్‌మార్క్ డైనమిక్ ఐలాండ్ డిజైన్‌తో దీనిని వినియోగదారులకు పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది.. మార్కెట్‌లోకి ఐఫోన్ 18 మోడల్‌తో పాటు తక్కువ బడ్జెట్ వినియోగదారుల కోసం ఐఫోన్ 18eతో పాటు ఐఫోన్ ఎయిర్ 2 మోడల్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

గత సంవత్సరం భారత్‌లో ఐఫోన్ 17 ప్రారంభ ధర రూ.82,900తో లాంచ్‌ అయిన సంగతి తెలిసిందే.. అయితే, మెమరీ కాంపోనెంట్ల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో మార్కెట్లో ధరలు కూడా విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది.. తాజా సమాచారం ప్రకారం.. ఐఫోన్ 18 ధర మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని టెక్‌ నిపుణులు తెలుపుతున్నారు.. యాపిల్ అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు అద్భుతంగా పని చేసేందుకు ఐఫోన్ 18, ఐఫోన్ 18e మోడల్స్‌లో మెమరీని భారీగా అప్‌గ్రేడ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.. వీటిలో ఏకంగా 9GB ర్యామ్‌ను కూడా తీసుకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని టెక్‌ నిపుణులు తెలుపుతున్నారు..

ఐఫోన్ 18e మోడల్ మాత్రం బడ్జెట్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.12-అంగుళాల LTPS OLED డిస్ల్పేను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కూడా A20 ప్రాసెసర్‌తో పాటు 9GB ర్యామ్‌తో లాంచ్‌ చేయబోతున్నట్లు లీక్‌ అయిన వివరాలు స్పష్టం చేశాయి.. అంతేకాకుండా 48-మెగాపిక్సెల్ ప్రధాన రియర్ కెమెరాతో పాటు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్‌ భాగంలో 24-మెగాపిక్సెల్ కెమెరాను తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tech News
Telugu News