• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Panna Diamond: తెలంగాణ ఎన్‌ఎండీసీ పన్నా గనిలో విలువైన వజ్రం..రూ.2.5 కోట్ల విలువైన డైమండ్ లభ్యం!

Panna Diamond: తెలంగాణ ఎన్‌ఎండీసీ పన్నా గనిలో విలువైన వజ్రం..రూ.2.5 కోట్ల విలువైన డైమండ్ లభ్యం!

NMDC Panna Diamond: పన్నా వజ్రాల గనిలో ఓ అరుదైన వజ్రం దొరికింది. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్‌ఎండీసీకి చెందిన సిబ్బందికి ఈ అదుదైన డైమండ్ లభించగా.. దీన్ని వేలం నిర్వహించి విక్రయించారు. దీని విలువ సుమారు రూ.2.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

Written ByHarish Darla
Published: Sep 17, 2026, 07:20 PM IST|Updated: Sep 17, 2026, 07:23 PM IST
joinshare
Panna Diamond: తెలంగాణ ఎన్‌ఎండీసీ పన్నా గనిలో విలువైన వజ్రం..రూ.2.5 కోట్ల విలువైన డైమండ్ లభ్యం!
Image Credit: Source: Zee Telugu News

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

NMDC Panna Diamond: మధ్యప్రదేశ్‌లోని పన్నా డైమండ్ మైన్‌లో అరుదైన వజ్రం దొరికింది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎన్ఎండీసీకి చెందిన సిబ్బంది ఏకంగా 27.29 క్యారెట్ల క్వాలిటీ వజ్రాన్ని వెలికి తీశారు. అయితే మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని పన్నా గనిలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత దొరికిన రెండో విలువైన వజ్రం కావడం విశేషం.

అయితే ఇప్పుడు దొరికిన ఈ విజ్రానికి వేలంలో భారీ వాల్యు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆకారం, రంగు, స్వచ్ఛత, బరువును పరిశీలించిన తర్వాత ప్రారంభ వేలం ధర సుమారు కోటి రూపాయలుగా నిర్ణయించే అవకాశం ఉన్నట్లు ఎన్ఎండీసీ వెల్లడించింది. వేలం పూర్తయ్యే సమయానికి ఈ పన్నా వజ్రం సుమారు రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల వరకు పలికే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

అయితే ఇలాంటి అరుదైన, విలువైన వజ్రం దొరకడంపై ఎన్ఎండీసీ సీఎండీ అమితవ ముఖర్జీ స్పందించారు. తమ సిబ్బంది కష్టానికి ఇది దక్కిన ప్రతిఫలంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో ఖనిజ సంపద ఎంతటి విలువ దాగుందో ఈ వజ్రం మరోసారి తెలియజేసిందని అన్నారు. మైనింగ్‌లో కేవలం ఐరన్ ఓర్‌కే పరిమితం కాకుండా ఇతర విలువైన ఖనిజాల వ్యాపారాన్ని కూడా విస్తరించే విధంగా సంస్థ పనిచేస్తుందని తెలిపారు. 

పన్నా ప్రాజెక్ట్ ఎన్‌ఎండీసీకి చెందిన నవరత్న పీఎస్‌యూ‌లో నాన్-ఐరన్ ఓర్ బిజినెస్‌కు ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారనుంది. ఈ పన్నా గనిలో ఏడాదికి దాదాపుగా 84 వేల క్యారెట్ల వజ్రాలను ఉత్పత్తి చేస్తే సామర్థ్యం ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు సుమారు 6 వేల క్యారెట్ల వజ్రాలను ఉత్పత్తి చేసినట్లు సంస్థ వెల్లడించింది.

పన్నా ప్రాంతంలో ఎన్‌ఎండీసీ దాదాపుగా 60 ఏళ్ల పాటు కొనసాగుతోంది. 1965లో వజ్రాల అన్వేషణ ప్రారంభించగా.. 1966-68 మధ్య మజ్‌గావన్ డైమండ్ ప్రాజెక్ట్‌ను 
అధికారికంగా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత 1971-72లోలో మజ్‌గావన్ మైన్స్‌లో కమర్షియల్ స్థాయిలో పూర్తిస్థాయి డైమండ్ ప్రొడక్షన్ ప్రారంభమైంది. 

Also REad: ఏపీ, తెలంగాణ ప్రజలకు చల్లని కబురు..బంగాళాఖాతంలో అల్పపీడనం..భారీ వర్షాలకు హెచ్చరిక!

Also Read: Komatireddy Rajgopal: "నేనే ముఖ్యమంత్రి అవుతా..రాజన్న రాజ్యం తెస్తా!" కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్
 


 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Add Zee News as a Preferred Source