Onion Prices Increase Soon: మధ్యతరగతి వంటింట్లో నిత్యవసరమైన ఉల్లిపాయ ధరలు మళ్ళీ కొండెక్కాయ్.. మొన్నటి వరకు అందుబాటు ధరల్లో ఉన్న ఉల్లిపాయలు.. ఇప్పుడు కొనుగోలుదారులకు కన్నీళ్లు పెట్టించేలా చేస్తున్నాయి.. గత రెండు నెలల వ్యవధిలోనే దాదాపు ధర మూడు రేట్లు పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తుండడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల బడ్జెట్ తలకిందులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇవి ఇంతలా పెరగడానికి గల కారణాలేంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
జూలై నెలలో హైదరాబాద్ మార్కెట్లోని కిలో ఉల్లిపాయ ధర రూ.15 నుంచి కేవలం రూ.20 వరకు పలికిన సంగతి తెలిసిందే.. అయితే ప్రస్తుతం నగరంలోని రిటైల్ మార్కెట్లతో పాటు స్థానిక దుకాణాల్లో మంచి ఉల్లిపాయలు కిలో రూ.70 చేరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక బయటి మార్కెట్లలో గ్రేడ్ ఆధారంగా ఉల్లిపాయలు రూ.60 నుంచి రూ.75 వరకు విక్రయిస్తున్నారు. దీంతో మార్కెట్కు వెళ్లే వినియోగదారులు అరకిలో తో పాటు కేవలం పావు కిలో తోనే సరి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది..
నగరానికి ప్రధానంగా సరుకు సరఫరా చేసే మలక్పేట హోల్సేల్ మార్కెట్ కు నిత్యం వచ్చే ఉల్లిపాయల బస్తా సంఖ్య కూడా గణనీయంగా పడిపోయినట్లు తెలుస్తోంది. సాధారణ రోజుల్లో మలక్పేట్ మార్కెట్ కు దాదాపు 25 వేలకు పైగా బస్తాల సరుకు వచ్చేదట.. కానీ ఇప్పుడు మాత్రం కేవలం 15000 బస్తాల ఉల్లిపాయలు మాత్రమే వస్తున్నాయని మార్కెట్కు సంబంధించిన కొంతమంది తెలుపుతున్నారు. సరఫరా భారీగా తగ్గి.. డిమాండ్స్ స్థిరంగా ఉండటంతో హోల్సేల్ నుంచి రిటైల్ వరకు ధరలు చుక్కలు చూపెడుతున్నాయి..
ఉల్లిపాయల ధరల పెరుగుదలకు ప్రధాన కారణం పంట దిగుబడి దారుణంగా పడిపోవడమేనని మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు. తెలుగు రాష్ట్రాలైన కర్నూలు తో పాటు అనంతపురం జిల్లాల్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉల్లిపాయ సాగు విస్తీర్ణత తగ్గి.. భారీ మొత్తంలో దిగుబడి కూడా తగ్గినట్లు సమాచారం. మరోవైపు.. దేశంలోని ప్రధాన ఉల్లి ఉత్పత్తి కేంద్రమైన మహారాష్ట్రలోని నాసిక్ పరిసరాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు విపరీతంగా దెబ్బతిన్నాయి. వరదలతో పాటు అధిక తేమ కారణంగా అక్కడ చేతికి వచ్చిన పంట పొలాల్లోనే కుళ్ళిపోయింది.. ఒకవైపు వర్షాల్లేక.. మరోవైపు అతివృష్టి కారణంగా పంటలు దెబ్బ తినడంతో ఉల్లిపాయ ధరలపై తీవ్ర ప్రభావం పడింది..
వారం రోజుల్లో రూ.100 దాటే అవకాశం..
ఇలాగే పరిస్థితులు కొనసాగితే ఉల్లిపాయ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలతో పాటు వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. కొత్త పంట చేతికి వచ్చేవరకు కూరతో తప్పదని.. మరోవారం లేదా పది రోజుల్లో రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లిపాయ ధర దాదాపు రూ.100 రూపాయలకు అయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు. పరిస్థితి మరింత విషమించక ముందే ప్రభుత్వం రంగంలోకి దిగి సబ్సిడీ ధరలతో రైతు బజార్ల ద్వారా ఉల్లిపాయలను విక్రయించాలని ప్రజలు కోరుతున్నారు..
ఇది కూడా చదవండి..: అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..