SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఓపీఎస్, సీపీఎస్ కోరుతూ.. నేడు OUలో 1500 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ భారీ ర్యాలీ..!!

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో సుమారు 1500 మంది బోధనేతర సిబ్బంది.. నేడు నవంబర్ 4వ తేదీన వర్సిటీలో భారీ ర్యాలీ చేపట్టనున్నారు. వర్సిటీలో శ్రమదోపిడీ జరుగుతుందని.. నాన్ టీచింగ్ స్టాఫ్ జాయింట్ యాక్షన్ కమిటీ తన ప్రకటనలో ఆరోపించింది. ఓపీఎస్, సీపీఎస్ స్కీములను బోధనేతర సిబ్బందికి అమలు చేయాలని ఉద్యోగులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.

Written By Bhoomi
Published: Nov 04, 2026, 09:47 AM IST | Updated: Nov 04, 2026, 09:49 AM IST
Image Credit: Osmania University
Join

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో సుమారు 1500 మంది బోధనేతర సిబ్బంది.. నేడు నవంబర్ 4వ తేదీన వర్సిటీలో భారీ ర్యాలీ చేపట్టనున్నారు. వర్సిటీలో శ్రమదోపిడీ జరుగుతుందని.. నాన్ టీచింగ్ స్టాఫ్ జాయింట్ యాక్షన్ కమిటీ తన ప్రకటనలో ఆరోపించింది. ఓపీఎస్, సీపీఎస్ స్కీములను బోధనేతర సిబ్బందికి అమలు చేయాలని ఉద్యోగులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.

2001 నుంచి 2004వ సంవత్సరం మధ్యకాలంలో బాధ్యతలు స్వీకరించిన ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ వర్తింపజేయాలన్నది తమ ముఖ్య డిమాండ్ అని నాన్ టీచింగ్ సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో పాటు 2004 తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సదుపాయం కల్పించాలంటూ విజ్నప్తి చేస్తున్నారు. వీటితోపాటుగా ఎన్జీవోస్, టెక్నికల్, ఎంప్లాయిస్ అసోసియేషన్లకు చెందిన అంతర్గత నోటిఫికేషన్లను విడుదల చేయడంతోపాటు ప్రమోషన్ల ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలంటూ డిమాండ్ చేశారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న ఎల్ఐసీ లింక్డ్ పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు  చేయడంతోపాటు ఓపీఎస్, సీపీఎస్ లను పునరుద్ధరించాలంటూ కోరుతున్నారు. ఈ డిమాండ్ల సాధనకై వర్సిటీలోని చారిత్రాత్మక ఆర్ట్స్ కాలేజీ నుంచి అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వరకు ఉద్యోగులు నేడు భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ 10వ తేదీన ధర్నా నిర్వహించనున్నట్లు  ఓయూ నాన్ టీచింగ్ జేఏసీ ప్రకటించింది.

విజ్ఞానాన్ని అందించే ఓయూలో పనిచేస్తున్న ఉద్యోగులు దయనీయ పరిస్థితుల్లో కాలం వెళ్లుదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న రెగ్యులర్, టైమ్ స్కేల్, కాంట్రాక్ట్ సిబ్బంది ప్రాథమిక హక్కులను నిలువునా కాలరాస్తున్నారని నాన్ టీచింగ్ స్టాఫ్ తమ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. దీనితో పాటు ఉద్యోగులకు అందించే మెడికల్ రీయింబర్స్‌మెంట్ పరిమితిని రూ. 10 వేల నుంచి రూ. 30 వేలకు పెంచాలని బోధనేతర సిబ్బంది డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ నాన్-టీచింగ్ జేఏసీ చైర్మన్ డాక్టర్ బి. కుమార్, కో-చైర్మన్ నాగరాజు రావు, ప్రెసిడెంట్ అబ్దుల్ ఖదీర్ ఖాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ అక్బర్ బేగ్, వైస్ ప్రెసిడెంట్లు సి. ఉపేందర్, పి. పవన్ కుమార్, జనరల్ సెక్రటరీ బి. వెంకటేష్, జాయింట్ సెక్రటరీ వి. నారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ యారాల రాజేష్, సెక్రటరీలు అఫ్సర్, అంజయ్య,  ట్రెజరర్ విఠల్ గౌడ్ సంయుక్తంగా ఊరుకున్న మీడియా ప్రకటన ద్వారా తమ డిమాండ్లను స్పష్టం చేశారు.

Also Read: 

కండక్టర్ ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం భరోసా: రూ.10 లక్షల ఆర్థిక పరిహారం ప్రకటన!

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES