SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తెలంగాణ పింఛన్‌దారులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అక్కడ అప్లై చేస్తే వెంటనే పెన్షన్..!!

Pension Rules: తెలంగాణలో చేయూత పెన్షన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షన్ పొందుతున్న భర్త మరణించినట్లయితే.. భార్యకు వెంటనే పెన్షన్ మంజూరు చేయనున్నారు.

Written By Bhoomi
Published: Oct 31, 2026, 08:58 AM IST | Updated: Oct 31, 2026, 09:01 AM IST
Image Credit: Pension Rules
Join

Pension Rules: తెలంగాణలో చేయూత పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్దిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భర్తను కోల్పోయిన మహిళలకు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేంచుకు వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెన్షన్ పొందుతున్న భర్త మరణించినట్లయితే.. అతని భార్యకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ స్థానంలో పెన్షన్ మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివ్రుద్ధి శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో, వృద్ధాప్య పింఛను పొందుతున్న భర్త మరణిస్తే, ఆ పింఛను వెంటనే అతని భార్యకు బదిలీ చేసేవారు. ఇప్పుడు, ఈ సౌకర్యాన్ని గీతా కార్మికులు.. చేనేత కార్మికులు, దివ్యాంగులు, ఫైలేరియా, హెచ్‌ఐవి,  డయాలసిస్ బాధితులు వంటి వర్గాలకు కూడా విస్తరించారు. ఈ వర్గాలకు చెందిన పింఛనుదారుల భార్యలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క తెలుసుకున్న వెంటనే, ఈ నిర్ణయాన్ని సవరించి, నిబంధనలను ఆమోదించారు.

రాష్ట్ర విపత్తు నివారణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) సీఈఓ దివ్య దేవరాజన్ అందించిన సమాచారం ప్రకారం, పింఛనుదారుడు మరణించే సమయానికి భార్య వయస్సు ఆధారంగా పింఛను వర్గాన్ని నిర్ణయిస్తారు. భర్త మరణించే సమయానికి భార్య వయస్సు 57 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే, ఆమెకు వితంతు పింఛను ఇస్తారు. ఆమెకు 57 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉంటే, ఆమె క్రమం తప్పకుండా వృద్ధాప్య పింఛను చెల్లింపులను అందుకుంటుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి? 
*ఈ పింఛను కోసం ప్రభుత్వం దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసింది.

* గ్రామీణ ప్రాంతాలు: గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలు తమ దరఖాస్తులను తమ పరిధిలోని పంచాయతీ కార్యదర్శికి సమర్పించాలి.

* పట్టణ ప్రాంతాలు: పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో నివసించే వారు తమ దరఖాస్తులను సంబంధిత బిల్ కలెక్టర్‌కు సమర్పించాలి.

* అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, మరణించిన భర్త ఆధార్ కార్డు,  మరణ ధృవీకరణ పత్రం  ఫోటోకాపీని జతచేయండి.

ధృవీకరణ పూర్తయిన తర్వాత, దరఖాస్తులు సమర్పించిన వెంటనే అధికారులు వాటిని చేయూత పోర్టల్‌లో నమోదు చేస్తారు.

తదనంతరం, క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శి లేదా బిల్ కలెక్టర్ ధృవీకరణను పూర్తి చేసి, అర్హతను నిర్ధారిస్తారు. ధృవీకరణ పూర్తయిన వెంటనే, పింఛను ఆమోద ఉత్తర్వు ఆలస్యం లేకుండా జారీ అవుతుంది. ఈ కొత్త నిబంధన భర్తలను కోల్పోయి, మానసిక, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వేలాది మంది మహిళలకు తక్షణ ఆర్థిక భద్రతను అందిస్తుంది.

Also Read: 

బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ లో ఏకంగా 16రోజులు బ్యాంకులు బంద్..!!

52 వేల మంది ఎస్జీటీల ఆవేదన.. పేద పిల్లల భవిష్యత్తు కోసం.. జీవో 25 సవరించండంటూ సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి!

Add Zee News as a Preferred Source

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES