Police filed case on keto diet expert Veeramachaneni Ramakrishna: రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. సోషల్ మీడియాలో సైతం అనేక మంది నెటిజన్లు వీరమాచినేని డైట్ ను చాలా మంది పాటిస్తారు. వీఆర్ కే డైట్ ను చాలా మందిఫాలో అవుతారు. ఈ క్రమంలో ఆహరపదార్థాలు ఎలా తినాలి..?.. డైట్ పై వీరమాచినేని అనేక సూచనలు ఇస్తుంటారు. అయితే ఇటీవల మధుమేహంతో బాధపడుతున్న 30ఏళ్ల ఒక న్యాయ విద్యార్థి కల్లెడ సాయికృష్ణ ఈ వీడియోలను చూసి ఇటీవల వీరమాచినేని రామకృష్ణను సంప్రదించాడు.
ఆయన చెప్పిన డైట్ తో పాటు, ఆరోగ్య చిట్కాలు, మందులు తీసుకున్నాడు. దీనికి గాను రూ. 26 వేలు ఫీజును తీసుకున్నాడు. వీరమాచినేని సూచనల ప్రకారం చిట్కాలు పాటించిన న్యాయ విద్యార్థి కేవలం రెండు రోజుల్లో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో బాధితుడు సైబరాబాద్ లోని రాయదుర్గం పోలీసులను ఆశ్రయించాడు.
మధుమేహం నయమవుతుందనే హామీతో ఇన్సులిన్ మాన్పించి 'VRK డైట్', తప్పుడు సప్లిమెంట్లు సూచించారని ఫిర్యాదు లో బాధితుడు కల్లెడ సాయికృష్ణ పేర్కొన్నాడు. దీంతో తన ఆరోగ్యం విషమించి డయాబెటిక్ కెటోయాసిడోసిస్ వ్యాధితో సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని బాధితుడు ఆరోపణలు చేశాడ. ఈ క్రమంలో రాయదుర్గం పోలీసులు డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.