• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Diwali Tips: మంచిర్యాలలో ప్రకృతి మిత్ర ర్యాలీ.. 'టపాసులు వద్దు.. మట్టి దీపాలే ముద్దు'

Diwali Tips: మంచిర్యాలలో ప్రకృతి మిత్ర ర్యాలీ.. 'టపాసులు వద్దు.. మట్టి దీపాలే ముద్దు'

Prakruthi Mithra Called Pollution Free Diwali: హిందూవుల అతి పెద్ద పండుగ దీపావళి రావడంతో కాలుష్య రహితంగా ఈ పండుగను చేసుకుందామని మహిళలు పిలుపునిచ్చారు. మంచిర్యాలలో ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన జరగ్గా.. దీపావళిని కాలుష్య రహితంగా చేసుకుందామని నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది.

Written By Ravi Kumar Sargam
Published: Nov 06, 2026, 04:08 PM IST|Updated: Nov 06, 2026, 04:12 PM IST
joinshare
Diwali Tips: మంచిర్యాలలో ప్రకృతి మిత్ర ర్యాలీ.. 'టపాసులు వద్దు.. మట్టి దీపాలే ముద్దు'
Image Credit: Prakruthi Mithra Diwali Rally

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
తెలంగాణను కరువులోకి నెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి..: టీ. జీవన్ రెడ్డి!

తెలంగాణను కరువులోకి నెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి..: టీ. జీవన్ రెడ్డి!

2

Python Video: నా మీదే అటాక్ చేస్తావా..?.. కొండ చిలువకు సుస్సు పోయించిన వానరం.. వీడియో..

3

BRS: 'రేవంత్‌ రెడ్డి నిర్లక్ష్యంతోనే హైదరాబాద్ నగరానికి తాగునీటి కష్టాలు': బీఆర్‌ఎస్‌ పార్టీ

4

చెత్తబుట్టను చూసి పారిపోయిన రోబో.. 24 గంటల డ్యూటీలో చైనాలో వింత ఘటన!

5

స్టాక్ మార్కెట్ లో భారీ పతనమంటే.. షేర్ల కొనుగోళ్లకు మంచి అవకాశమా? వైరల్ అవుతున్న వాదనపై AI ఏం చెబుతోంది..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Prakruthi Mithra Awareness Rally: దీపావళిని కాలుష్య రహితంగా జరుపుకోవాలని.. టపాసులు వద్దు మట్టి దీపాలే ముద్దు అని మంచిర్యాల పట్టణ మహిళలు నినదించారు. కాలుష్య రహిత దీపావళి పండుగను చేసుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహిళలు ప్రతిజ్ఞ చేసి మట్టి నూనె దీపాలతో ప్రదర్శన చేపట్టారు. ప్రకృతి మిత్ర తెలంగాణ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాలలోని కలెక్టరేట్ రోడ్డులో ఉన్న 'ప్రకృతి మిత్ర' రాష్ట్ర కార్యాలయ ఆవరణలో కాలుష్య రహిత దీపావళి  నిర్వహణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మట్టి ప్రమిదలతో చేసిన దీపాలను, ప్లే కార్డ్స్ ప్రదర్శించి, కాలుష్య నివారణ, ప్రకృతి హితమైన దీపావళి పై నినాదాలు చేశారు. కాలుష్యం వద్దు అంటూ దీపావళి ప్రతిజ్ఞ  చేశారు. ప్రకృతి మిత్ర రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, 'వాల్టా' అథారిటీ పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ.. దీపావళి అంటే నూనె దీపాల వరుస అని.. ఇది  కాలుష్యాన్ని కలిగించే  బాంబుల వరుస కాదని తెలిపారు. ప్రజలందరూ ప్రకృతికి, మూగజీవాలకు హాని కలిగించని మట్టి  దీపాలు వెలిగించి ఆనందంగా దీపావళి పండుగ చేసుకోవాలని సూచించారు.

దీపావళిని బాంబులు, టపాసులతో చేసుకుంటే దానివలన వెలువడే కాలుష్యంతో గర్భిణీలు, వృద్ధులు, పిల్లలతోపాటు మూగజీవాలు జీవ వైద్యంపై తీవ్రమైన ప్రభావం ఉంటుందని ప్రకృతి మిత్ర రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గుండేటి యోగేశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. దీపావళి కాలుష్యంతో గుండె, నరాలు, ఎన్నికల లోపం, కంటి, చర్మ సంబంధిత వ్యాధుల పడే ప్రమాదం ఉందని వివరించారు. రాజ్యాంగాన్ని , పలు పర్యావరణ చట్టాలను గౌరవిస్తూ కాలుష్యం కలిగించే టపాసులు స్వచ్ఛందంగా నిషేధించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా మహిళలతో కాలుష్య రహిత దీపావళి ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అగ్నిమాపక, అటవీ శాఖ , అధికారులు సత్యనారాయణ, రమేశ్‌ బాబు, సంతోశ్‌ కుమార్ మాట్లాడుతూ.. గాలి, శబ్ద, నీటి కాలుష్యాన్ని అత్యధిక మోతాదులో  కలిగించే బాణసంచాను కాల్చవద్దని విజ్ఞప్తి చేశారు. పండుగ సంప్రదాయంలో తప్పనిసరి పరిస్థితుల్లో గ్రీన్ టపాసులు మాత్రమే పరిమితంగా కాల్చాలని సూచించారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే 101 నెంబర్ కి ఫోన్ చేసి తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. దీపావళిని కాలుష్యం లేకుండా సంప్రదాయ రీతిలో చేసుకోవాలని.. టపాసులు, బాంబులు, చిచ్చుబుడ్డీలు కాకుండా దీపాలతో కేదారేశ్వరి అమ్మవారిని పూజించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతిమిత్ర ప్రతినిధులు రాచకొండ చందన చిప్ప జ్యోతి, స్వర్ణలత, హేమ ఉన్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Telugu News
Festivals