China Humanoid Robots Video: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు రోబోటిక్స్ రంగాల్లో మానవుడి స్థానాన్ని రోబోలే భర్తీ చేస్తున్నాయన్న ప్రచారం జరుగుతున్న విపరీతంగా జరుగుతున్న సమయంలో.. చైనాలో జరిగిన ఒక ఆసక్తికర ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ వస్తోంది. నిరంతరం ఎలాంటి అలసట లేకుండా పనిచేస్తాయనుకున్న రోబోలు.. 24 గంటల షిఫ్ట్ డ్యూటీ నిర్వహించలేక మధ్యలోనే చేతులెత్తేశాయట.. ఒకటి చెత్తబుట్టను చూసి అక్కడి నుంచి పారిపోగా.. మరొకటి పని చేయడకుండా అలాగే ఉండిపోయిందట... ఈ విచిత్ర ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది..
చైనాలోని షాంఘై నగరంలో ప్రముఖ రోబోట్ సంస్థ ఎజిబాట్, తమ అత్యాధునిక సాంకేతికతను చెక్ చేసేందుకు ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారట.. శుహుయ్ ప్రాంతంలోని ఓ రియల్ కన్వీనియన్స్ స్టోర్‌లో 6 జి 2 హ్యూమనాయిడ్ రోబోలను 24 గంటల పూర్తిగా షిఫ్ట్ ఉద్యోగంలో పెట్టారట.. రోబోట్స్ నెవర్ క్లాక్ అవుట్ పేరుతో ఈ ఛాలెంజ్‌ను నవంబర్ 2 ఉదయం 10 గంటల నుంచి నవంబర్ 3 ఉదయం వరకు కొన్ని సోషల్ మీడియాల్లో లైవ్‌స్ట్రీమ్ కూడా చేశారు.
ఈ సమయంలో రోబోలు లంచ్ రద్దీతో పాటు సాయంత్రం వేళల్లో కస్టమర్ల రద్దీ, రాత్రి షిఫ్ట్‌లు, ఉదయం టిఫిన్స్ సమయాల్లో పనులు చేయాల్సి వచ్చింది. మొత్తం 24 గంటల్లో ఈ 6 రోబోలు కలిసి దాదాపు 1,730 పనులను పూర్తి చేశాయట.. వీటిలో 683 సార్లు కస్టమర్స్‌కి నమస్కరిస్తూ స్వాగతం పలకడం.. 369 సార్లు వస్తువులను ఇవ్వడం, 147 కప్పుల కాఫీ తయారు చేయడంతో పాటు 126 హాట్-ఫుడ్ ఆర్డర్లు చేయడంతో పాటు 277 సార్లు షెల్ఫ్‌లలో సరుకులను అటుఇటు పెట్టడం.. 128 సార్లు టేబుల్స్ శుభ్రం చేయడం వంటి పనులు చేశాయి..
పనులు చురుగ్గానే చేసినట్లు నిపించినా.. ఫైనల్ రిజల్ట్ సమయంలో సంస్థకు ఊహించని షాక్ తగిలింది.. ట్రయల్ రన్‌లో ఆరింటిలో నాలుగు రోబోలు మాత్రమే బాగా పని చేశాయి. రెండు రోబోలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయి..
నైట్ షిఫ్ట్‌లో పనులు చేస్తున్న రోబోకు ఒక్కసారిగా చెత్తతో నిండిన డస్ట్‌బిన్ కనిపించాయి. అది చూడగానే అయోమయానికి గురైన ఆ రోబో.. మార్గం తప్పి స్టోర్ తలుపుల నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్లిపోయిందట. తిరిగి తన పని ప్రదేశానికి రాకుండా ఉండిపోయిందట. దీంతో చెత్తను చూసి రోబో ఉద్యోగం వదిలి పారిపోయిందంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు కూడా చేశారు. ఇప్పడు ఈ రోబోలకు సంబంధించిన వింత వింత విశేషాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Robots Never Clock Out | AGIBOT G2’s 24-Hour Convenience Store Challenge Six AGIBOT G2 take on a 24-hour shift as convenience store trainees. From rush-hour crowds to late-night solo duty and the morning breakfast sprint, can they keep up with nonstop customers and unexpected requests? https://t.co/eg1fUhcr3T
— AGIBOT (@AGIBOTofficial) November 2, 2026