Mahabubabad: గురుకుల హస్టళ్లలో ఎలుకల కలకలం.. రాత్రిళ్లు చేతులు, కాళ్లను కొరుకుతూ.. లబో దిబో మంటున్న విద్యార్థులు.!.
Rats in mahabubabad gurukul hostel: రాత్రివేళ నిద్రిస్తున్న విద్యార్థుల కాళ్లు, చేతులను ఎలుకలు కొరుకుతుండటంతో భయాందోళన నెలకొంది. ఈక్రమంలో తహసీల్దార్ నాగభవాని హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహాబూబాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.
Rats attack on gurukul students in gudur mahabubabad: ఇటీవల తెలంగాణలోని కొన్ని ప్రభుత్వ స్కూళ్లు,హస్టల్ లలో ఎలుకలు సంచారం తీవ్ర తలనొప్పిగా మారింది. ముఖ్యంగా కొంత మంది సిబ్బంది నెగ్లీజెన్సీ వల్ల ఎలుకలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హస్టల్ లలో పారిశుధ్ద్యలోపం వల్ల ఎలుకల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో విద్యార్థులు ఎలుకల కాట్లకు బలౌతున్నారు. మహబూబాబాద్ లోని గూడూరు సంక్షేమ హాస్టల్‌లో ఇలాంటి కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.
మహబూబాబాద్ జిల్లా గూడూరు సంక్షేమ హాస్టల్‌లో ఇటీవల ఎలుకల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. పారిశుధ్య లోపంతో ప్రాంగణం మురికికూపంగా మారింది. రాత్రివేళ నిద్రిస్తున్న విద్యార్థుల కాళ్లు, చేతులను ఎలుకలు కొరుకుతుండటంతో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఎలుకల భయంతో విద్యార్థులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నమని స్టూడెంట్స్ వాపోతున్నారు. చీకటి పడగానే ఎలుకలుబైటకు వచ్చి విచ్చలవిడిగా సంచారం చేస్తు, తమ కాళ్లను కొరుకుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు.
దీనిపై తమ గోడును హస్టల్ సిబ్బంది,తల్లిదండ్రులకు చెప్పారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు హస్టల్ సిబ్బందిని ప్రశ్నించిన సరైన విధంగా రెస్పాన్స్ లేకపొవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన కాస్త ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో దీనిపై అధికారులు రంగంలోకి దిగారు. ఎలుకల కాటు ఘటనలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. హస్టల్ లో పారిశుద్దంపై తనిఖీలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో.. తహసీల్దార్ నాగభవాని హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసి, బాధిత విద్యార్థులకు తక్షణ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మరోవైపు హాస్టల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు.