• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /కడుపు ఉబ్బరం, గ్యాస్‌తో ఇబ్బంది పడుతున్నారా? ఇంట్లోనే ఉండే ఈ 5 చిట్కాలతో నిమిషాల్లో రిలీఫ్!

కడుపు ఉబ్బరం, గ్యాస్‌తో ఇబ్బంది పడుతున్నారా? ఇంట్లోనే ఉండే ఈ 5 చిట్కాలతో నిమిషాల్లో రిలీఫ్!

అతిగా కారం ఉన్న స్పైసీ ఆహారం తిన్నప్పుడు కడుపు నిండిపోతుంది, అజీర్తి, గ్యాస్ సమస్య వస్తుంది. అయితే పనులు కూడా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దీని వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. కొన్ని ఇంటి చిట్కాలతో వీటి నుంచి బయటపడవచ్చు.

Written ByRenuka Godugu
Published: Nov 22, 2026, 21:05 IST|Updated: Nov 22, 2026, 21:07 IST
joinshare
కడుపు ఉబ్బరం, గ్యాస్‌తో ఇబ్బంది పడుతున్నారా? ఇంట్లోనే ఉండే ఈ 5 చిట్కాలతో నిమిషాల్లో రిలీఫ్!
Image Credit: Stomach Bloating and Gas Relief:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
KTR Memory: వరంగల్‌తో విడదీయరాని అనుబంధం.. గుర్తుచేసుకున్న కేటీఆర్‌

KTR Memory: వరంగల్‌తో విడదీయరాని అనుబంధం.. గుర్తుచేసుకున్న కేటీఆర్‌

2

Healthy Food for Kids: పిల్లలు ఇష్టంగా తినే 5 హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ ఐడియాస్.. ఆరోగ్యానికి ఎంతో మంచివి!

3

కడుపు ఉబ్బరం, గ్యాస్‌తో ఇబ్బంది పడుతున్నారా? ఇంట్లోనే ఉండే ఈ 5 చిట్కాలతో నిమిషాల్లో రిలీఫ్!

4

KTR Speech: 'కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ షురూ.. 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి: కేటీఆర్

5

పార్లర్ వాక్సింగ్, రేజర్ అవసరం లేదు.. కేవలం 3 కిచెన్ ఐటమ్స్‌తో ముఖంపై వెంట్రుకలు తగ్గే సీక్రెట్ ఇదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Stomach Bloating and Gas Relief: పండుగ సమయం కాకపోయినా, స్పైసీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు కడుపులో అజీర్తి, గ్యాస్ ఏర్పడుతుంది. దీనివల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇంట్లో ఉన్న కొన్ని పదార్థాలతో కడుపులో గ్యాస్, అజీర్తిని తగ్గించుకోవచ్చు. జీలకర్ర, సోంపు, ఇంగువ ఈ సమస్యలకు మంచి ఇంటి చిట్కాలు. ఇవి శాస్త్రీయంగా సరైన పరిష్కారాలని నిరూపితమైనా కాకపోయినా, మన పూర్వీకుల కాలం నుంచి వీటిని అనుసరిస్తున్నారు.

జీలకర్ర, సోంపు, వాము వంటి వంటగది పదార్థాలతో కడుపులో గ్యాస్, అజీర్తిని తగ్గించుకోవచ్చు. ఇవి జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని కొద్ది మొత్తంలో తీసుకుని, దోరగా వేయించుకుని తినవచ్చు. లేదా పొడి రూపంలో తీసుకుని, అందులో బ్లాక్ సాల్ట్ కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. గోరువెచ్చని నీటిలో కలిపి తాగవచ్చు కూడా.

అతిగా కారం ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల గుండెల్లో మంట సమస్య కూడా వస్తుంది, యాసిడ్ రిఫ్లక్స్ కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ చిట్కాలు మంచి పరిష్కారంగా ఉంటాయి. ఇంగువ కూడా ప్రతి వంటగదిలో అందుబాటులో ఉంటుంది. దీనిని తీసుకుంటే కడుపులో గ్యాస్, అజీర్తి సమస్య తగ్గుతుంది. వేడినీటిలో కలిపి కూడా తాగవచ్చు. సాధారణంగా మనం తినే పప్పు, కూరగాయల కూరల్లో కొద్దిగా ఇంగువ వేసుకుంటూ ఉంటాం. అయితే ఈ అజీర్తి సమస్య మరింత ఎక్కువైతే విరేచనాలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

సోంపు, జీలకర్రను కూడా ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఇవి భారతీయ వంటకాల్లో తప్పనిసరిగా ఉంటాయి. నాణ్యమైన ఉత్పత్తులతో జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. వీటిలో డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది. కాబట్టి జీర్ణ సమస్యలకు ఇవి తక్షణ పరిష్కారంగా పనిచేస్తాయి.

ఒక కప్పు నీటిలో ఈ పదార్థాలన్నింటినీ వేసి మరిగించండి. వడకట్టుకుని, గోరువెచ్చగా అయ్యాక తాగాలి. ఇలా చేయడం వల్ల కడుపులో అజీర్తి, గ్యాస్ సమస్య తగ్గుతుంది.
అల్లం టీ కూడా మంచి ప్రయోజనాలు ఇస్తుంది. ఇది కడుపులో గ్యాస్, అజీర్తిని తగ్గిస్తుంది. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే తాజా అల్లాన్ని తీసుకుని, తురుముకుని, ఒక కప్పు నీటిలో వేసి మరిగించి తాగవచ్చు. ఇందులో కొద్దిగా నిమ్మరసం కలిపితే మరింత ప్రయోజనం కలుగుతుంది.

తరచూ గ్యాస్, అజీర్తి కలిగించే మన రోజువారీ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ఎక్కువగా స్పైసీ ఆహారం తీసుకోవడాన్ని తగ్గించాలి. కార్బోనేటెడ్ డ్రింక్స్‌కు కూడా దూరంగా ఉండాలి, ఎందుకంటే ఇవి క్రమంగా దీర్ఘకాలిక మలబద్ధక సమస్యకు దారితీస్తాయి. ఇలాంటి సమయంలో పాల ఉత్పత్తులను కూడా తీసుకోకూడదు.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)

Add Zee News as a Preferred Source
TAGS:
daily life
Health