• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /వరంగల్
  • /KTR Memory: వరంగల్‌తో విడదీయరాని అనుబంధం.. గుర్తుచేసుకున్న కేటీఆర్‌

KTR Memory: వరంగల్‌తో విడదీయరాని అనుబంధం.. గుర్తుచేసుకున్న కేటీఆర్‌

KT Rama Rao Recollects Memories With Warangal: వరంగల్‌ సభ వేదిక నుంచి ఓరుగల్లుతో ఉన్న అనుబంధాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గుర్తుచేసుకున్నారు. నాడు ఉద్యమంలో పోరాటం చేసిన రోజులు.. మంత్రిగా వరంగల్‌ అభివృద్ధి చేసిన పనులు గుర్తుచేసుకున్న కేటీఆర్‌ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 22, 2026, 21:19 IST|Updated: Nov 22, 2026, 21:22 IST
joinshare
KTR Memory: వరంగల్‌తో విడదీయరాని అనుబంధం.. గుర్తుచేసుకున్న కేటీఆర్‌
Image Credit: KTR Speech In Warangal

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
KTR Memory: వరంగల్‌తో విడదీయరాని అనుబంధం.. గుర్తుచేసుకున్న కేటీఆర్‌

KTR Memory: వరంగల్‌తో విడదీయరాని అనుబంధం.. గుర్తుచేసుకున్న కేటీఆర్‌

2

Healthy Food for Kids: పిల్లలు ఇష్టంగా తినే 5 హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ ఐడియాస్.. ఆరోగ్యానికి ఎంతో మంచివి!

3

కడుపు ఉబ్బరం, గ్యాస్‌తో ఇబ్బంది పడుతున్నారా? ఇంట్లోనే ఉండే ఈ 5 చిట్కాలతో నిమిషాల్లో రిలీఫ్!

4

KTR Speech: 'కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ షురూ.. 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి: కేటీఆర్

5

పార్లర్ వాక్సింగ్, రేజర్ అవసరం లేదు.. కేవలం 3 కిచెన్ ఐటమ్స్‌తో ముఖంపై వెంట్రుకలు తగ్గే సీక్రెట్ ఇదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

BRS Party Warangal Meeting: ఓరుగల్లు గడ్డతో తనది ఉద్యమ అనుబంధం అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. వరంగల్‌తో తనకు విడదీయలేని అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇదే వరంగల్‌లో కాగడాల ప్రదర్శనలో కవాతు చేసిన రోజులు, 17 ఏళ్ల కిందట నవంబర్ 29న అరెస్టయి వరంగల్ సెంట్రల్ జైలులో ఖైదీగా గడిపిన సందర్భం తనకు ఇప్పటికీ గుర్తున్నాయని కేటీఆర్‌ వెల్లడించారు.

వరంగల్‌లో ఏకశిలా విద్యాసంస్థల అధినేత తిరుపతి రెడ్డి ఆదివారం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్‌ కీలక ప్రసంగం చేశారు. 'కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం సాగిన ప్రతి కీలక సందర్భంలోనూ వరంగల్ అండగా నిలిచింది. ఉద్యమ మహాగర్జన నుంచి తెలంగాణ రజతోత్సవ సభ వరకు ఓరుగల్లు ప్రజలు అందించిన మద్దతును ఎప్పటికీ మరువలేం' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అలాంటి వరంగల్‌ను రేవంత్‌ రెడ్డి వచ్చాక పట్టించుకోవడం లేదని.. వరంగల్ అభివృద్ధిని మూడేళ్లుగా అటకెక్కించారని విమర్శించారు.

తెలంగాణ ఉద్యమంలో ప్రతి పరీక్షా సమయంలోనూ ఓరుగల్లు అండగా నిలిచిందని.. భవిష్యత్తులోనూ వరంగల్ ప్రజల ఆశీర్వాదం బీఆర్‌ఎస్‌ పార్టీకి ఉంటుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. 2028లో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. పేదల సంక్షేమం, రైతుల అభివృద్ధి, యువతకు ఉపాధి, వరంగల్ ప్రగతి, తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలంటే కేసీఆర్ నాయకత్వం మళ్లీ రావాలని గుర్తుచేశారు. కేసీఆర్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చుకుంటేనే వరంగల్‌తో పాటు తెలంగాణ సురక్షితంగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

'కేసీఆర్ పాలనలో వరంగల్‌ను రాష్ట్రంలోనే ప్రధాన పారిశ్రామిక, విద్యా, వైద్య, ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు పునాదులు వేశాం. 24 అంతస్తులు, 2,250 పడకలు, 35 వైద్య విభాగాలతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను 90 శాతం పూర్తి చేశాం. జనగామ, మహబూబాబాద్ ఆసుపత్రుల పనులు కూడా దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరు చేసి వైద్య విద్యకు పెద్దపీట వేశాం' అని కేటీఆర్‌ వరంగల్‌ అభివృద్ధి చిట్టా వివరించారు.

అంతేకాకుండా వరంగల్‌లో ఐటీ అభివృద్ధికి కృషి చేశామని ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్‌ గుర్తుచేసుకున్నారు. 'మడికొండ ఐటీ పార్కులో ఎల్ అండ్ టీ మైండ్‌ట్రీ, సైయెంట్, టెక్ మహీంద్రా, క్వాడ్రంట్ వంటి కంపెనీలను తీసుకొచ్చి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాం' అని వెల్లడించారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో కిటెక్స్, గణేశా ఎకోస్పియర్, యంగ్‌వన్ వంటి పరిశ్రమలను తీసుకొచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించామని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సమస్యను పరిష్కరించామని, రూ.150 కోట్లతో రెండు సమీకృత కలెక్టరేట్లు, ఔటర్ రింగ్ రోడ్డు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మాజీ మంత్రి కేటీఆర్‌ వివరించారు.

మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో వరంగల్‌కు ఒక్క కొత్త ఐటీ కంపెనీని, ఒక్క కొత్త పరిశ్రమను తీసుకురాలేకపోయారని కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికే ఉన్న కంపెనీలు కూడా మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పది శాతం పనులు చేయాల్సిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పూర్తి చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రైవేట్ ఆసుపత్రుల ప్రారంభోత్సవాలకు మాత్రం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. పేదల కోసం నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించకుండా, మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించడంపై ప్రశ్నలు సంధించారు. ఆ ఆసుపత్రితో ముఖ్యమంత్రి బినామీ సంబంధాలున్నాయన్న ఆరోపణను కూడా ప్రస్తావించారు.

నిజమైన భవిష్యత్తు ఉన్న నగరం (ఫ్యూచర్‌ సిటీ) వరంగల్ అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తెలిపారు. వరంగల్‌ను రాష్ట్రంలోనే ప్రధాన పారిశ్రామిక, ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యతను భవిష్యత్తులో తాను తీసుకుంటానని ప్రకటించారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరు మీద 1,217 మంది కూర్చునే సామర్థ్యంతో నిర్మించిన కళాక్షేత్రంలో కుడా కార్యాలయం ఏర్పాటు చేయాలనే కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. కవులు, కళాకారులు, రచయితల కోసం నిర్మించిన కళాక్షేత్రాన్ని ప్రభుత్వ కార్యాలయంగా మార్చాలనుకునే నిర్ణయాన్ని వరంగల్ ప్రజల వ్యతిరేకతతోనే రేవంత్‌ రెడ్డి వెనక్కి తీసుకుందని వివరించారు. కాకతీయుల కళాతోరణం, కాళోజీ వారసత్వం, వరంగల్ సాంస్కృతిక వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత రేవంత్‌ రెడ్డిపై ఉందని మాజీ మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. కాకతీయుల పౌరుషానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఓరుగల్లు గడ్డపై కాంగ్రెస్, బీజేపీల రాజకీయాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకోవడంలో రేవంత్‌ రెడ్డి విఫలమయ్యాడని.. దేవాదుల పంపులు, కన్నెపల్లి మోటార్లను సమర్థంగా నిర్వహించి నీటిని వినియోగించుకోవాల్సిన సమయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించిన కేటీఆర్‌.. వరంగల్ అభివృద్ధి, యువతకు ఉపాధి, ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:
KTR
BRS
Warangal
Telugu News