SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

Revanth Reddy Announces Praja Balam Programme: సైమన్‌ కమిషన్‌ మాదిరి మోదీ సర్‌ ప్రక్రియను తీసుకువచ్చారని.. సర్‌ పేరిట కోట్ల ఓట్లను తొలగిస్తున్నారని రేవంత్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సర్‌ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని.. ఓట్లు తొలగకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 22, 2026, 17:44 IST | Updated: Nov 22, 2026, 17:48 IST
Image Credit: Congress PAC Meeting
Join

Hyderabad: 'దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, మహిళల ఓట్లు తొలగిస్తున్నారు. వలసలు వెళ్లడంతోనే వారి ఓట్లు తొలగిస్తున్నారు. ఈ వర్గాలు మొదటినుంచి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. గతంలో సర్ ప్రక్రియ ఓటు హక్కు కల్పించడం కోసం ఉండేది. కానీ మోదీ మొదటిసారి ఓట్ల తొలగింపునకు ఉపయోగిస్తున్నారు' అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 'తెలంగాణలో 71 లక్షల ఓట్లను పక్కన పెట్టారు. కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఓలు అప్రమత్తంగా ఉండాలి. ఇంటి పేరు సరిగా లేకపోయినా ఓట్లను తొలగిస్తున్నారు. యాంత్రికంగా ఓట్లను తొలగిస్తున్నారు' అని వివరించారు.

'బ్రిటిష్ హయాంలో సైమన్ కమిషన్‌లాగా వందేళ్ల తరహాత మోదీ సర్ తీసుకువచ్చారు. సైమన్ కమిషన్ గోబ్యాక్ నినాదంలాగా ఇప్పుడు  జ్ఞానేష్ కుమార్ గో బ్యాక్ నినాదంతో ముందుకు రావాలి' అని పీఏసీ సమావేశంలో రేవంత్‌ రెడ్డి తెలిపారు. సర్ పైన పూర్తి అప్రమత్తంగా ఉండాలని.. ఎన్నికల వరకు వేచి చూడొద్దని పార్టీ నాయకులకు సూచించారు. ఓట్ హక్కులేని వాళ్లు, ఓట్ హక్కు ఉన్నవాళ్లు అనే రెండు రకాల ప్రజలను బీజేపీ తయారు చేస్తుందని.. దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులను తయారుచేస్తుందని చెప్పారు. 'సంక్రాంతి తర్వాత 5 నెలలు ప్రజా బలం కార్యక్రమాన్ని తీసుకుంటాం. ప్రతి గ్రామానికి నాయకులు వెళ్లాలి' అని రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ప్రతి ఒక్కరికి పని కల్పిస్తామని.. నిధులకు కొరత లేకుండా చూస్తామని ప్రకటించారు. పార్టీలో పనిచేసిన వారికి అనేక మందికి పదవులు ఇచ్చామని గుర్తుచేశారు.

'పరిపాలన ఎవరు చేయాలన్నది ప్రజలే నిర్ణయించాలని నెహ్రూ, మహాత్మా గాంధీ, అంబేడ్కర్ భావించారు. అందుకే ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించింది. 2019లో 130 కోట్ల జనాభా ఉంటే ఓట్లు 91 కోట్లు ఉన్నాయి. 2024లో 140 కోట్ల జనాభా ఉంటే ఓట్లు 97.5 కోట్లు ఉన్నాయి. సర్ పేరుతో కనీసం 20 కోట్ల ఓట్లు తొలగించే అవకాశం ఉంది. 13 కోట్లు ఇప్పటికే తొలగించారు' అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.


మళ్లీ ప్రభుత్వాన్ని తీసుకురావడమే లక్ష్యం
ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన బీఎం సందీప్ కుమార్‌.. యువజన కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు' అని తెలిపారు. ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉందని.. నిజాయితీ, నిబద్ధతతో పార్టీ కోసం పనిచేసిన నాయకుడు అని వెల్లడించారు. తెలంగాణలో పార్టీ, ప్రభుత్వ సమన్వయ బాధ్యతలను అధిష్టానం సందీప్‌కు అప్పగించిందని.. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నాయకత్వానికి మహేశ్‌ కుమార్ గౌడ్‌ తెలిపారు. 

'కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఉద్యమం చేస్తున్నారు. సర్ పై తెలంగాణలోనూ పలు కార్యక్రమాలు చేపట్టాం. కేంద్ర విధానాలతో తెలంగాణకు ఎక్కువ నష్టం జరుగుతోంది' అని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ సూచించారు. పార్టీ బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని చెప్పారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ZEENEWS TRENDING STORIES