SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

Revanth Reddy Hot Comments About MLAs Anirudh Reddy And Komatireddy Rajgopal Reddy In PAC Meeting: ధిక్కార స్వరం వినిపిస్తూ.. సొంత ప్రభుత్వంపైనే తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, అనిరుధ్‌ రెడ్డిలపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనను బహిరంగంగా దూషిస్తున్న వారిద్దరినీ ఈసారికి వదిలేద్దామని చెప్పడం గమనార్హం.

Written By Ravi Kumar Sargam
Published: Nov 22, 2026, 17:18 IST | Updated: Nov 22, 2026, 17:29 IST
Image Credit: Revanth Reddy
Join

Telangana Congress: సొంత ప్రభుత్వంపైనే తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ ధిక్కార స్వరం వినిపిస్తుండడమే కాకుండా.. తనను తీవ్రంగా దూషిస్తున్న ఎమ్మెల్యేలు అనిరుధ్‌ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిలపై రేవంత్‌ రెడ్డి క్షమించేశారు. ఈసారికి వదిలేద్దామని పార్టీ నాయకత్వంతో చెప్పారు. తర్వాత మళ్లీ రెచ్చిపోతే వాళ్ల సంగతి చూసుకుందామని హెచ్చరించారు. ఇక ఎవరికేమైనా ఇబ్బందులు ఉంటే పార్టీ ఇన్‌చార్జ్‌కి విన్నవించుకోవచ్చని కాంగ్రెస్‌ నాయకులకు రేవంత్ రెడ్డి సూచించారు.

హైదరాబాద్‌లోని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్‌లో నూతన ఏఐసీసీ ఇన్‌చార్జి ఎంబీ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో పీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, కాంగ్రెస్‌ నాయకులతో కలిసి రేవంత్‌ రెడ్డి హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తీవ్ర ధిక్కార స్వరం వినిపిస్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి అంశం పీఏసీ సమావేశంలో చర్చకు వచ్చింది. రా.గోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పలువురు నాయకులు కోరగా.. ఈ అంశంపై రేవంత్‌ రెడ్డి స్పందించారు. 'ఈ ఒక్కసారికి వదిలేద్దాం' అని చెప్పినట్లు సమాచారం. 'ఈసారి మళ్లీ పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేలా మాట్లాడితే చర్యలు తీసుకుందాం' అని చెప్పినట్లు తెలుస్తోంది.

'ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇంచార్జీకి చెప్పాలి. ఎన్నికల వరకు సందీప్ ఇన్‌చార్జిగా ఉంటారు. నా వల్ల సమస్యలు ఉంటే ఇంచార్జీకి ఫిర్యాదు చేయాలి. మంత్రులతో సమస్యలు ఉంటే ఇంచార్జీకి ఫిర్యాదు చేయాలి. ఇంచార్జీకి ఫిర్యాదు చేస్తే మాతో తప్పకుండా చర్చిస్తారు. నష్టపరిచే వ్యాఖ్యలతో చేసే మంచి చర్చకు రాకుండా పోతుంది' అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. '66 శాతం పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించాం. మునిసిపల్ ఎన్నికల్లో 85 శాతం విజయం సాధించాం' అని గుర్తుచేశారు.

'100 ఏళ్ల తర్వాత మొదటిసారి తెలంగాణలో ఓబీసీ కులగణన నిర్వహించాం. 2027లో కేంద్రం చేపట్టే జనగణనలో ఓబీసీ కులగణన చేయాలి. ఈ సమావేశం నుంచి తీర్మానం ద్వారా కేంద్రాన్ని  కోరుతున్నాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రికి ఈ విషయంపై లేఖ రాయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్ గౌడ్‌కు సూచించారు. తొలి ప్రధాని నెహ్రూ చొరవతో దేశంలో విద్య ప్రతి ఒక్కరికి అందుతోందని.. నెహ్రూ ప్రణాళికలతో సాగునీటి రంగం బాగా అభివృద్ధి చెందిందని వెల్లడించారు.

'ఎల్‌నినోతో వర్షాలు పడడం లేదు. 100 దేశాలు ఎల్ నినో ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నాయి. పక్కన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలో కరవు పరిస్థితులు ఉన్నాయి. వచ్చే 8 నెలలు తాగునీటి ని అందించాల్సి ఉంది. ప్రాజెక్టులో ఉన్న నీటిని తాగునీటి కోసం వినియోగించాల్సి ఉంది' అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. తక్కువ నీటితో పండే పంటలను రైతులు సాగు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఆహార ధాన్యాలకు కొరత లేదని స్పష్టం చేశారు. వర్షాకాలంలో 20 వేల మెగావాట్ల డిమాండ్ ఉన్నా రైతులకు అందించామని.. పంటలు ఎండిపోకుండా కాపాడామని చెప్పుకొచ్చారు.

'ఎల్‌నినోని ఎదుర్కోవడానికి రూ.30 వేల కోట్లు అవసరం. ఈ సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పీఏసీ సమావేశంలో కూడా కేంద్రాన్ని కోరుతూ తీర్మానాలు చేయాలి' అని రేవంత్‌ రెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరికి పని కల్పించడమే లక్ష్యంగా త్వరలో పెద్ద కార్యక్రమం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకంలో పని చేసే వారి సంఖ్య బాగా పెరిగిందని చెప్పారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ZEENEWS TRENDING STORIES