• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /సామాన్యుడికి బియ్యం మంట.. ప్రభుత్వం రేట్లు ఫిక్స్ చేసినా కిలో సన్నబియ్యం రూ.100..!!

సామాన్యుడికి బియ్యం మంట.. ప్రభుత్వం రేట్లు ఫిక్స్ చేసినా కిలో సన్నబియ్యం రూ.100..!!

Rice Rate: ప్రతికూల వాతావరణ పరిస్థితులు ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో వరి దిగుబడి గణనీయంగా పడిపోయింది.

Written ByBhoomi
Published: Nov 16, 2026, 09:27 IST|Updated: Nov 16, 2026, 09:29 IST
joinshare
సామాన్యుడికి బియ్యం మంట.. ప్రభుత్వం రేట్లు ఫిక్స్ చేసినా కిలో సన్నబియ్యం రూ.100..!!
Image Credit: Rice Rate

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rice Rate: ప్రతికూల వాతావరణ పరిస్థితులు ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో వరి దిగుబడి గణనీయంగా పడిపోయింది. దీనికి తోడు కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడంతో తెలంగాణలో బియ్యం ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయి. ఈ ఆకస్మిక ధరల పెరుగుదలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగి, సన్నబియ్యంపై గరిష్ట రిటైల్ ధరలను  నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే.. ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు ఖరారు చేసిన తక్కువ ధరలకు బియ్యాన్ని విక్రయించడం తమకు ఆర్థికంగా ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని రిటైలర్లు.. వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు, ధరల నియంత్రణ పేరుతో మార్కెట్లో నాణ్యమైన సన్నబియ్యం లభించడం లేదని, నాసిరకం బియ్యాన్ని అంటగడుతున్నారంటూ వినియోగదారుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గత కొన్ని సీజన్లలో ఎడతెగని వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా వరిసాగు, దిగుబడి గణనీయంగా పడిపోయింది. ఈ తగ్గుదల అవకాశంగా మలచుకుని  కొందరు వ్యాపారులు మార్కెట్లో క్రుత్రిమ కొరతను స్రుష్టించారు. స్టాక్ ను దాచిపెట్టి, డిమాండ్ ను క్రుత్రిమంగా పెంచడం వల్ల బియ్యం ధరలను ఒక్కసారిగా పెంచేశారు. దీంతో సామాన్య ప్రజలు నిత్యావసరమైన బియ్యం కొనుగోలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది.

సామాన్యుడిపై భారాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ధరలను నియంత్రించాలని నిర్ణయించింది. మార్కెట్ ధరలను స్థిరీకరించడానికి, వివిధ రకాల బియ్యం కోసం కిలోకు ఈ క్రింది గరిష్ట చిల్లర ధరలను అధికారికంగా ప్రకటించారు:

BPT , KNM: కిలోకు రూ. 66

RNR: కిలోకు రూ. 74

HMT: కిలోకు రూ. 79

క్షేత్రస్థాయిలో సవాళ్లు: నాణ్యత క్షీణించడం, చిల్లర వ్యాపారుల ఆందోళనలు:

ప్రభుత్వం నిర్ణయించిన ధరలను అమలు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు వినియోగదారులకు నాణ్యమైన, అధిక-నాణ్యత గల బియ్యం లభించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, టోకు మార్కెట్‌లో అధిక ధరలకు బియ్యాన్ని కొనుగోలు చేయవలసి వస్తోందని, ప్రభుత్వం నిర్ణయించిన తక్కువ ధరలకు అమ్మితే నష్టాలు వస్తాయని చిల్లర వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల నుండి కఠిన చర్యలు -హెచ్చరిక:

ధరల నియంత్రణను కఠినంగా అమలు చేయడానికి, కృత్రిమ కొరతను సృష్టించే వ్యాపారులపై చర్యలు తీసుకోవడానికి పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి, బియ్యాన్ని అధిక ధరలకు విక్రయించి, అక్రమంగా నిల్వ చేసే వారిపై పీడీ చట్టం కింద కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.

Also Read: 

తరచూ అలసట, తల తిరగడం వేధిస్తున్నాయా? విటమిన్ B12 లోపం కావొచ్చు..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telangana News