చెప్పాపెట్టకుండా డ్యూటీ ఎగ్గొట్టారు.. ఒక్కరోజే 183 మంది టీచర్లు గాయబ్..చర్యలకు రంగం సిద్ధం!
School inspections: సర్కారు బడుల్లో విద్యాబోధన తీరు..టీచర్ల హాజరుపై విద్యాశాఖ అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పలు షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. చెప్పాపెట్టుకుండా ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా పలువురు టీచర్లు విధులకు గైర్హాజరైనట్లు అధికారులు గుర్తించారు.
School inspections: సర్కారు బడుల్లో విద్యాబోధన తీరు..టీచర్ల హాజరుపై విద్యాశాఖ అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పలు షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. చెప్పాపెట్టుకుండా ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా పలువురు టీచర్లు విధులకు గైర్హాజరైనట్లు అధికారులు గుర్తించారు.
ఏకంగా 183 మంది టీచర్లు ముందస్తు సమాచారం లేకుండా విధులకు డుమ్మా కొట్టడం ఇప్పుడు కలకలం రేపుతోంది. స్కూల్లకు గౌర్హాజరవుతున్న టీచర్లపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మండిపడ్డారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన 183 మంది ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేయాలంటూ డీఈవో యాదయ్యను ఆదేశించారు.
సెప్టెంబర్ లో వినాయకచవితి వేడుకల నుంచి నిమజ్జనం వరకు 12 రోజుల్లో కొందరు టీచర్లు పాఠశాలలకు వెళ్లలేదు. ఉపాధ్యాయుల హాజరు నమోదు ప్రక్రియ Facial recognition పద్దతి ఉన్నా కొందరు పాఠశాలకు నిర్ణీత సమయానికి వెళ్లడం లేదు. కలెక్టర్ ప్రియాంక ఇటీవల పాతబస్తీ, సికింద్రాబాద్, కోఠి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ ప్రాంతాల్లోని స్కూళ్లలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో ఉపాధ్యాయులు గైర్హాజరైనట్లు గుర్తించారు. గత శనివారం అంటెండెన్స్ తెప్పించి పరిశీలించారు. 183 మంది ఉపాధ్యాయులు చెప్పాపెట్టకుండా పాఠశాలకు హాజరు కానట్లు గుర్తించారు.
ఇక సెలవు పెట్టకుండా స్కూల్ కు రాని టీచర్లు రెండోసారి కూడా గైర్హాజరైనట్లయితే.. వారిపై సస్పెన్షన్ వేటు వేస్తామని విద్యాశాఖ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. రోజూ టీచర్ల హాజరును పర్యవేక్షించాలని డీఈవోను ఆదేశించారు. ఇక నుంచి ప్రతి స్కూలులో ఉపాధ్యాయుడు ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతను మండల విద్యాశాఖ అధికారులకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు.